https://oktelugu.com/

Wall Clock Vastu: గడియారం ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసా?

Wall Clock Vastu: మన ఇంట్లో గోడ గడియారం పెట్టుకుంటాం. ఇంట్లో సమయం తెలియడానికి వీటిని వాడుతుంటాం. ప్రతి వస్తువు అమరికలో వాస్తు ఉండాల్సిందే. వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు తప్పవు. గడియారం పెట్టుకునే దిశ కూడా వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇంట్లో ప్రతికూలతలు వస్తాయి. గడియారం మన ఇంట్లో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చో తెలుసుకోవాలి. ఇంట్లో పగిలిపోయిన, పాడైపోయిన గడియారాలు ఉంచుకోకూడదు. ఇలా చేస్తే మనకు అరిష్టమే. ఆగిపోయిన గడియారాలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 25, 2023 / 04:49 PM IST
    Follow us on

    Wall Clock Vastu: మన ఇంట్లో గోడ గడియారం పెట్టుకుంటాం. ఇంట్లో సమయం తెలియడానికి వీటిని వాడుతుంటాం. ప్రతి వస్తువు అమరికలో వాస్తు ఉండాల్సిందే. వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు తప్పవు. గడియారం పెట్టుకునే దిశ కూడా వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇంట్లో ప్రతికూలతలు వస్తాయి. గడియారం మన ఇంట్లో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చో తెలుసుకోవాలి.

    ఇంట్లో పగిలిపోయిన, పాడైపోయిన గడియారాలు ఉంచుకోకూడదు. ఇలా చేస్తే మనకు అరిష్టమే. ఆగిపోయిన గడియారాలు మన ఎదుగుదలను ఆపేస్తాయి. పగిలిపోయిన గడియారాలు మనకు నష్టాలు తెస్తాయి. అందుకే వాటిని ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. ఈ నేపథ్యంలో గడియారాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి.

    గడియారాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో పెట్టుకోవడం మంచిది. ఈ రెండు దిశల్లో గడియారం పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది. కానీ దక్షిణ దిశలో ఎప్పుడు గడియారం పెట్టుకోకూడదు. అటు వైపు పెట్టుకుంటే ప్రతికూలతలు పలకరిస్తాయి. ఇలా గడియారాన్ని అమర్చుకునే క్రమంలో వాస్తు పద్ధతులు పాటించి మనకు వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    గడియారంలో శబ్ధాలు వస్తుంటాయి. అవి శ్రావ్యంగా ఉండేలా చూసుకోవాలి. భయంకరంగా ఉంటే మనకు అలజడి కలుగుతుంది. మంచి సంగీతం వంటి శబ్ధాలు వస్తే ఇబ్బందులు ఉండవు. ఈ నేపథ్యంలో గడియారం విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలుసుకోవాలి.