Vastu Tips: పూజ గది ఏ దిక్కున ఉండాలో తెలుసా?

పిరమిడ్ లాంటి ఆకారంగా ఉండే మందిరాన్ని చాలా మంది ఇళ్లల్లో చూసే ఉంటారు. అయితే ఇదే బెస్ట్ అంటారు వాస్తు నిపుణులు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు.

Written By: Swathi, Updated On : February 15, 2024 4:14 pm

Vastu Tips

Follow us on

Vastu Tips: వాస్తులో అన్నింటికంటే ముఖ్యమైనది దిక్కు. ఎందుకంటే వస్తువులు ఏ దిక్కున ఉండాలి. ఇల్లు, వాకిలి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సూచించదగ్గ దిక్కులోనే ఉండాలి అంటారు. అయితే ఈ దిక్కులను పాటించి ఇంట్లోని వస్తువులు అమర్చడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. అయితే అన్నింటికింటే ముఖ్యంగా ప్రతి ఇంట్లో పూజ చేస్తుంటారు. మరి ఈ పూజ గది ఏ దిక్కున ఉండాలి అనే విషయాన్ని కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ పూజ గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది అంటారు.

పిరమిడ్ లాంటి ఆకారంగా ఉండే మందిరాన్ని చాలా మంది ఇళ్లల్లో చూసే ఉంటారు. అయితే ఇదే బెస్ట్ అంటారు వాస్తు నిపుణులు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు. మామూలుగా ఉండే గదుల్లో సీలింగ్ కంటే కూడా పూజ గదికి ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి పూజ గది నిర్మించుకునేటప్పుడు ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత బెస్ట్. కనుక ఫాలో అయిపోండి.

దిక్కుల తర్వాత ప్లేస్మెంట్ చాలా ముఖ్యం. ఏ వైపు ఏ దేవుడి విగ్రహాలు పెడుతున్నారు అనేది చాలా అవసరం. అయితే ఒకే దేవుడి విగ్రహాలను ఎక్కువ పెట్టకుండా.. ఒక్కో దేవుడి విగ్రహం ఉండేలా చూసుకోవాలి. విగ్రహాలకు మధ్య గ్యాప్ ఉండాలి. అలానే వాటిని ఎప్పుడు శుభ్రం చేస్తుండాలి. విరిగిపోయిన విగ్రహాలను, పగిలిపోయిన చిత్ర పటాలను పూజ గదిలో ఉంచకూడదు. దీని వల్ల అరిష్టం అంటారు వాస్తు నిపుణులు.

పూజ గదిలో పుస్తకాలు, దీపాలు, అగర్బత్తులు ఇవన్నీ సర్దుకోవడానికి చాలా మంది తెలియక పూజ గదిలో అల్మారాలు కట్టిస్తారు. ఎక్కువ అల్మారాలు అస్సలు ఉండకూడదు. చాలా తక్కువ అల్మారాలు లేదా ఒక అల్మారా ఉంటే పర్వాలేదు. అది కూడా ఆగ్నేయం వైపు మాత్రమే ఉంచుకోవాలి. ఇది కూడా తప్పక ఫాలో అవ్వండి.