Wealthiest Temples In India: ఆధ్యాత్మికతకు ఆలవాలం మనదేశం. ఇక్కడ ఉన్న దేవాలయాలు ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాల్లో నిధులు, భక్తుల కానుకలు చెల్లింపుతో ఘనమైన ఆదాయాన్ని కలిగి ఉంటున్నాయి. ఇలాంటి దేవాలయాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. దీంతో ఆలయానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాకే. అలాంటి సంపద కలిగి ఉన్న దేవాలయాలు మన దేశంలో కొన్ని ఉండటం గమనార్హం. అక్కడ ఏటా రూ. వందల కోట్లు రావడంతో వాటిని ఖర్చు చేసేందుకు దేవాదాయ అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతుంటారు.

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ భక్తులు ఇచ్చే కానుకలు వచ్చే ఆదాయం విలువ అందరిలో ఆసక్తి గొలుపుతోంది. ఏడాదికి కనీసం రూ.1.20 కోట్లు రావడం అంటే మాటలు కాదు. ఇన్ని కోట్ల ఆదాయం రావడంతో మన దేశంలోనే అత్యంత సంపద కలిగిన దేవాలయంగా దీన్ని చెబుతారు. ఏటా వచ్చే ఆదాయంతో పలు ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. సామాజిక కార్యక్రమాల్లో కూడా సంపదను ఖర్చు చేస్తుంటారు.
మన దేశంలోని దేవాలయాల్లో తిరుమల తిరుపతికి కూడా ప్రాధాన్యం ఉంది. సంపద కలిగిన దేవాలయాల్లో రెండోదిగా గుర్తింపు పొందింది. తిరుపతిలో ఏటా రూ. 650 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. భక్తులు కానుకల రూపంలో ఇచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి అత్యంత ఆదాయం ఆర్జించే ఆలయాల్లో ఒకటి కావడం గమనార్హం. జమ్ము కాశ్మీర్ లోని శ్రీ వైష్ణో దేవి ఆలయం కూడా సంపద ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయం ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని దక్కించుకుంటుంది.

మహారాష్ట్రలోని షిర్డీ సాయి దేవాలయం కూడా ఆదాయం ఘనంగానే సంపాదిస్తుంది. ఇక్కడ ఏటా రూ. 320 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. ముంబయిలోని సిద్ధివినాయక్ ఆలయం కూడా ఏటా రూ.125 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటుంది. పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం కూడా ఆదాయం బాగానే సంపాదిస్తుంది. ఇక్కడ ఏటా రూ. 100 కోట్ల ఆదాయం తెచ్చుకుంటుంది. తమిళనాడులోని మధురై లో ఉన్న మీనాక్షి దేవాలయం కూడా ఏటా రూ. 66 కోట్ల ఆదాయం దక్కించుకుంటుంది. ఇవే కాకుండా గుజరాత్ లోని సోమ్ నాథ్ దేవాలయం, కేరళలోని శబరిమల అయ్యప్ప, ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఆదాయాలు సమకూర్చుకుంటాయి. ఇలా దేశంలోని పలు దేవాలయాలు వాటి సంపదతో అత్యంత శక్తివంతంగా మారుతున్నాయి.