లైఫ్ స్టైల్Alcohol Food: మద్యం తాగేటప్పుడు అసలు ఏవి తినాలో తెలుసా?

Alcohol Food: మద్యం తాగేటప్పుడు అసలు ఏవి తినాలో తెలుసా?

Alcohol Food: రోజూవారి పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది సాయంత్రం రిలాక్స్ అవుదామని అనుకుంటారు. ఇందులో భాగంగా మనసు ప్రశాంతంగా ఉండడానికి మద్యం తీసుకుంటారు. మద్యం తీసుకోవడం వల్ల అప్పటివరకు ఉన్న ఒత్తిడి మొత్తం తొలగిపోతుందని చాలా మంది భావన. బాధలో ఉన్నా… సంతోషంలో ఉన్నా… మద్యం తాగడం వల్ల మజా వస్తుందని అనుకోవడంతో చాలా మంది దీనిని అడిక్ట్ అవుతున్నారు. ప్రతిరోజూ మోతాదులో మద్యం తీసుకోవడం మంచిదేనని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది పరిమితికి మించి ఫుల్లుగా తాగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడంతో అనారోగ్యాన బారిన పడుతున్నారు. అసలు మద్యం తాగేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఆ వివరాల్లోకి వెళితే…

మద్యం ప్రియుల్లో కొందరికి స్టఫ్(తీనే వస్తువులు) తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మరికొందరు మాత్రం కారం లేకుండా మద్యం తాగరు. అయితే మద్యం తాగుతున్నప్పుడు కాస్త మత్తు రావడంతో ఆహారంపై దృష్టి పెట్టరు. దీంతో ఎలాంటి ఆహార వస్తువులు లేకుండానే మద్యం సేవిస్తారు. కానీ ఇలా మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎలాంటి ఆహారం లేకుండా మద్యం తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఆ తరువాత బ్లడ్ లో మద్యం పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అయితే కొందరు మద్యం తాగేటప్పుడు కారం ఎక్కువగా ఉన్న పదార్థాలను తింటూ ఉంటారు. ఇటువంటివి తినడం కూడా మంచిది కాదు. మద్యం తాగేటప్పుడు కడుపునిండినట్లుగా ఆహారం ఉండడం వల్ల ఎంత మద్యం సేవించినా ఎఫెక్ట్ ఉండదు. అలా కడుపునిండినట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్రూట్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచింది. మరీ ముఖ్యంగా ఫైబర్ ను కలిగిన పదార్థాలు తినడం వల్ల మద్యం ప్రభావం శరీరంపై ఉండదు.

ప్రోటీన్లు కలిగిన ఆహారంలో భాగంగా చికెన్, చేపలు వంటివి మద్యం తాగేటప్పుడు తీసుకోవచ్చు. వీటిల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటూ ఇవి తినడం వల్ల శరీరానికి అదనపు శక్తి కూడా వస్తాయి. అలాగే మద్యం సేవించేటప్పుడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వీటిల్లో ఆవకాడో, ఆలివ్ ఆయల్ కలిగినవి తీసుకోవడం మంచింది. ఇక ఫైబర్ కలిగిన ఎటువంటి పదార్థాలైనా మద్యం తీసుకునేటప్పుడు తినాలి. ఇటువంటి ఆహారంతో మద్యం సేవించడం వల్ల శరీరంపై ఎటువంటి ప్రభావం లేకుండా ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Youth Alcohol: నో ఆల్కహాల్ అంటున్న యూత్.. కారణం ఇదే..

Youth Alcohol: రోజంతా ఎంతో కష్టపడి సాయంత్రం హ్యాపీగా ఉండాలని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివారు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడుతున్నారు. ఇందులో ప్రధానంగా మధ్య ఉంటుంది. మద్యం ద్వారా మనసు...

Alert For Alcohol Drinkers : మద్యం తాగేవారికి అలర్ట్.. ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?

Alert For Alcohol Drinkers : మానసిక ప్రశాంతత కోసం మందు తాగడం తప్పనిసరి అని కొందరి భావన. దీంతో చాలామంది మద్యం సేవించడానికి ఏమాత్రం ఆలోచించరు. మద్యం తాగడం వల్ల హానికరమని...

Most Popular

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు...

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...

Stress Relief: రోజులో 24 నిమిషాలు ఇలా చేస్తే.. ఒత్తిడి మాయం..

Stress Relief: ప్రస్తుత కాలంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ, సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కారణాలతో మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చాలామంది తమ ఆరోగ్యాన్ని కంటే...
Exit mobile version