Alcohol Food: మద్యం తాగేటప్పుడు అసలు ఏవి తినాలో తెలుసా?

మద్యం ప్రియుల్లో కొందరికి స్టఫ్(తీనే వస్తువులు) తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మరికొందరు మాత్రం కారం లేకుండా మద్యం తాగరు. అయితే మద్యం తాగుతున్నప్పుడు కాస్త మత్తు రావడంతో ఆహారంపై దృష్టి పెట్టరు.

Written By: Srinivas, Updated On : January 4, 2024 11:36 am

Alcohol Food

Follow us on

Alcohol Food: రోజూవారి పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది సాయంత్రం రిలాక్స్ అవుదామని అనుకుంటారు. ఇందులో భాగంగా మనసు ప్రశాంతంగా ఉండడానికి మద్యం తీసుకుంటారు. మద్యం తీసుకోవడం వల్ల అప్పటివరకు ఉన్న ఒత్తిడి మొత్తం తొలగిపోతుందని చాలా మంది భావన. బాధలో ఉన్నా… సంతోషంలో ఉన్నా… మద్యం తాగడం వల్ల మజా వస్తుందని అనుకోవడంతో చాలా మంది దీనిని అడిక్ట్ అవుతున్నారు. ప్రతిరోజూ మోతాదులో మద్యం తీసుకోవడం మంచిదేనని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది పరిమితికి మించి ఫుల్లుగా తాగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడంతో అనారోగ్యాన బారిన పడుతున్నారు. అసలు మద్యం తాగేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఆ వివరాల్లోకి వెళితే…

మద్యం ప్రియుల్లో కొందరికి స్టఫ్(తీనే వస్తువులు) తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మరికొందరు మాత్రం కారం లేకుండా మద్యం తాగరు. అయితే మద్యం తాగుతున్నప్పుడు కాస్త మత్తు రావడంతో ఆహారంపై దృష్టి పెట్టరు. దీంతో ఎలాంటి ఆహార వస్తువులు లేకుండానే మద్యం సేవిస్తారు. కానీ ఇలా మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎలాంటి ఆహారం లేకుండా మద్యం తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఆ తరువాత బ్లడ్ లో మద్యం పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అయితే కొందరు మద్యం తాగేటప్పుడు కారం ఎక్కువగా ఉన్న పదార్థాలను తింటూ ఉంటారు. ఇటువంటివి తినడం కూడా మంచిది కాదు. మద్యం తాగేటప్పుడు కడుపునిండినట్లుగా ఆహారం ఉండడం వల్ల ఎంత మద్యం సేవించినా ఎఫెక్ట్ ఉండదు. అలా కడుపునిండినట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్రూట్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచింది. మరీ ముఖ్యంగా ఫైబర్ ను కలిగిన పదార్థాలు తినడం వల్ల మద్యం ప్రభావం శరీరంపై ఉండదు.

ప్రోటీన్లు కలిగిన ఆహారంలో భాగంగా చికెన్, చేపలు వంటివి మద్యం తాగేటప్పుడు తీసుకోవచ్చు. వీటిల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటూ ఇవి తినడం వల్ల శరీరానికి అదనపు శక్తి కూడా వస్తాయి. అలాగే మద్యం సేవించేటప్పుడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వీటిల్లో ఆవకాడో, ఆలివ్ ఆయల్ కలిగినవి తీసుకోవడం మంచింది. ఇక ఫైబర్ కలిగిన ఎటువంటి పదార్థాలైనా మద్యం తీసుకునేటప్పుడు తినాలి. ఇటువంటి ఆహారంతో మద్యం సేవించడం వల్ల శరీరంపై ఎటువంటి ప్రభావం లేకుండా ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.