https://oktelugu.com/

Anchor Suma: యాంకర్ సుమకు వరుస స్ట్రోక్స్… పరువు తీసిన కొడుకు!

సుమకు ఇండస్ట్రీలో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. దాంతో స్టార్స్ తో డెబ్యూ మూవీ బబుల్ గమ్ ని ప్రమోట్ చేయించింది. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ప్రమోషన్స్ కి ట్ తనవంతు సాయం చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2024 / 11:33 AM IST

    Anchor Suma

    Follow us on

    Anchor Suma: యాంకర్ సుమకు బ్యాడ్ టైం నడుస్తుంది. వివాదాలతో పాటు, చేసిన పనులు కూడా కలిసి రావడం లేదు. ఇటీవల మీడియాకు సుమ కనకాల క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆదికేశవ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. మీడియా మిత్రులు స్నాక్స్ భోజనాల మాదిరి తింటున్నారు. త్వరగా ముగించుకుని వేదిక వద్దకు రావాలని ఆమె మైక్ లో అన్నారు. దాంతో హర్ట్ అయిన మీడియా ప్రతినిధులు, మండిపడ్డారు.

    విషయం పెద్దది చేయకుండా సుమ క్షమాపణలు చేసింది. మీడియా మిత్రులతో నాకు ఏళ్ల అనుబంధం ఉంది. చాలా కాలంగా కలిసి ప్రయాణం చేస్తున్నాము. నా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని తెలిసింది. అందుకు క్షమాపణలు కోరుతున్నానని సుమ అన్నారు. దాంతో ఆ వివాదం ముగిసింది. ఇక కొడుకు రోషన్ ని హీరోగా లాంచ్ చేస్తే బెడిసి కొట్టింది.

    సుమకు ఇండస్ట్రీలో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. దాంతో స్టార్స్ తో డెబ్యూ మూవీ బబుల్ గమ్ ని ప్రమోట్ చేయించింది. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ప్రమోషన్స్ కి ట్ తనవంతు సాయం చేశాడు. ఇక సినిమా ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. లెక్కకు మించిన లిప్ లాక్ సన్నివేశాలతో బోల్డ్ గా తెరకెక్కించారు. హోమ్లీ యాంకర్ ఇమేజ్ ఉన్న సుమ తన కొడుకుని లాంచ్ చేసిన తీరు కొందరికి నచ్చలేదు. ఇంతకంటే మంచి సబ్జెక్టు దొరకలేదా? అని విమర్శలు చేశారు.

    బోల్డ్ కంటెంట్ తో యూత్ ని ఆకర్షిద్దాం అనుకుంటే అది జరగలేదు. పైగా ఇజ్జత్ పోయింది. రోషన్ బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు. నా రంగు చూసి ఎగతాళి చేశారు. వీడు హీరో ఏంటి అన్నారు. నేను ఇలానే ఉంటా… అని యాటిట్యూడ్ చూపించాడు. సినిమా బొక్కబోర్లా పడటంతో మనోడి ఛాలెంజ్లు అబాసుపాలయ్యాయి. బబుల్ గమ్ మూవీతో కొడుకు సుమ పరువు తీసినట్లు అయ్యింది. మరి నెక్స్ట్ రోషన్ ఎంచుకునే సబ్జెక్టు ఎలా ఉంటుందో చూడాలి..