Heart Diseases: ఆధునిక కాలంలో మన జీవనశైలి మారిపోతోంది. మనం తీసుకునే ఆహారమే మనకు రోగాలు తెచ్చిపెడుతోంది. ఫలితంగా చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి రోగాలు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా ఎన్నో రకాల వ్యాధులకు దగ్గరవుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మనకు రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకపోతే మన దేహం రోగాలకు కేంద్రంగా మారడం ఖాయం.

దీని కోసం కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే లాభమే. మన వంటింట్లో రోజు మనం వాడుకునేవే మందులా ఉపయోగపడతాయి. నాలుగు మిరియాలు, అంగుళం దాల్చిన చెక్క, చిటికెడు పసుపు, పుదీనా ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీరు పోసి వేడయ్యాక దంచి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీటిని వడకట్టి తేనె కలుపుని తాగాలి. ఇలా చేస్తే మనకు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.
మధుమేహంతో బాధపడే వారు తేనెను తీసుకోకూడదు. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఉదయం తీసుకుంటే రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దాల్చిన చెక్క రక్తప్రసరణను సక్రమంగా చేస్తుంది. మిరియాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వెల్లుల్లి ధమనుల్లో ఉండే పలకాన్ని తొలగిస్తుంది. పసుపు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి కరిగిస్తుంది. మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది కాబట్టి ఈ ద్రవాన్ని సహనంగా తయారు చేసుకోవాలి.

ఇన్ని రకాలుగా మన దేహానికి ఉపయోగపడే ఔషధాన్ని తయారు చేసుకుని తీసుకుంటే మంచి జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో వాడిన అన్ని వస్తువులు ఎంతో ప్రయోజనం కలిగించేవి. దీంతో ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకుని మన అనారోగ్యాలను దూరం చేసుకోవడం మంచిది. ఇవన్నీ మనం రోజు వాడుకునే వస్తువులే కావడంతో వాటిని మనం జాగ్రత్తగా తీసుకుని మన దేహానికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మన విధి. దీనికి అందరు మొగ్గు చూపి తాగేందుకు ముందుకు వస్తే ఎంతో లాభం.