Avasarala Srinivas- Avatar 2: ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన అవతార్ 2 ఫీవర్ కనిపిస్తుంది..అమెరికా నుండి అనకాపల్లి వరుకూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..టికెట్ ముక్క దొరికితే ఒట్టు!..పోటీగా కొత్త సినిమాలు కూడా ఏమి లేకపోవడం వల్ల అవతార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న థియేటర్స్ లో 90 శాతం అవతార్ 2 కి కేటాయిస్తున్నారు..స్టార్ హీరో సినిమాకి కాకుండా ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజ్ రిలీజ్ రావడం ఇదే తొలిసారి.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి..ముఖ్యం గా 3D వెర్షన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు..హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..ట్రెండ్ ని చూస్తూ ఉంటె ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుండే 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎంత హాలీవుడ్ సినిమా అయినా తెలుగు లో డబ్ అయ్యినప్పుడు మన రచయితలూ మరియు దర్శకుల అవసరం ఎంతైనా ఉంటుంది..ఇప్పుడు అవతార్ 2 మేకర్స్ కి అవసరాల శ్రీనివాస్ అవసరం పడింది..విలక్షణ నటుడిగా, రచయితగా, డైరెక్టర్ గా ఇలా ఎన్నో కోణాల్లో అద్భుతమైన ప్రతిభ ని చూపించిన అవసరాల శ్రీనివాస్, అవతార్ తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసాడట..అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ చాలా బాగుంటాయి..చాలా షార్ప్ గా, హ్యూమర్ తో నిండిపోయి ఉంటుంది ఆయన రచన.

అందుకే ఈ సినిమాకి అవసరాల శ్రీనివాస్ రచయితగా వ్యవహరిస్తే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది అని, ఆయన చేతిలో ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని పెట్టారు..అవసరాల శ్రీనివాస్ కూడా తాను ఎంతవరుకు న్యాయం చేయగలడో..అంతకు మించి ఈ సినిమా కోసం పని చేసాడు..ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.