Rajamouli- Prabhas: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పాన్ వరల్డ్ మార్కెట్ ని తీసుకొచ్చిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళి కి దక్కుతుంది..బాహుబలి సినిమాతో ఆయన తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసాడు..తెలుగు సినిమా అంటే ఇక నుండి ప్రాంతీయ బాషా చిత్రం కాదు..ఇండియన్ సినిమా అనేలాగా చేసాడు..ఇక రీసెంట్ గా విడుదలైన #RRR చిత్రం తో పాన్ ఇండియా కాదు..పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లాడు రాజమౌళి.

ఈ చిత్రానికి ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న విదేశీయుల రెస్పాన్స్ ని చూస్తుంటే మన రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి..ఒక ఇండియన్ సినిమాకి అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కడం అంటే మాములు విషయం కాదు..ఈమధ్యనే ఆయనకీ హాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డ్స్ అయిన న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ ద్వారా ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది..అంతే కాకుండా లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడిగా నామినేట్ అయ్యి రన్నర్ గా నిలిచాడు.
ఈ సందర్భంగా రాజమౌళి కి టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోల నుండి శుభాకాంక్షలు అందుతున్నాయి..ముందుగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో సంతోషిస్తూ ఇంస్టాగ్రామ్ లో #RRR మూవీ టీం కి మరియు రాజమౌళి కి శుభాకాంక్షలు తెలియచేసాడు.. ‘ది గ్రేట్ రాజమౌళి ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు..NYFCC అవార్డ్స్ లో నామినేషన్స్ దక్కించుకొని ఉత్తమ దర్శకుడిగా అవార్డుని గెల్చుకున్న రాజమౌళి కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను..అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెల్చుకున్న కీరవాణి కి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు’ అంటూ ప్రభాస్ ఒక పోస్ట్ పెడుతాడు.

దానికి క్రింద రాజమౌళి కామెంట్ చేస్తూ ‘థాంక్యూ డార్లింగ్..నేను అంతర్జాతీయ గుర్తింపుని పొందుతానని నాకంటే ముందుగా నువ్వే గుర్తించావు’ అని అంటాడు..ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది..ఇక రాజమౌళి అతి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతుంది..వచ్చే ఏడాది జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.