Bald head: ప్రస్తుత పరిస్థితుల్లో వెంట్రుకలు ఊడిపోవడం, తెల్లబడటం కామన్ గా మారిపోయింది. మనం తీసుకునే ఆహారంతోనే ఇవన్ని జరుగుతున్నాయని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. ఇరవై ఏళ్లకే జుట్టు రాలిపోయి బట్టతల రావడం, వెంట్రుకలు తెల్లబడటం చూస్తూనే ఉన్నాం. ఆహార పదార్థాలకు వాడే రసాయన మందుల ప్రభావంతోనే మన శరీరం గుల్లబారుతోంది. పలు రకాల జబ్బులకు కూడా రసాయన ఎరువులే కారణం. కానీ ఏం చేయలేం. మన చేతుల్లో ఏమీ లేదు. పండించే వారు జాగ్రత్తలు తీసుకుంటే మనకు కూడా రక్షణ చేకూరుతుంది. ఎవరు అంత శ్రమ తీసుకోవడం లేదు. మార్కెట్లో దొరికే మందులు తీసుకొచ్చి కొడుతూ ఆరోగ్యాలను గుళ్ల చేస్తున్నారు.

జుట్టు రాలిపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. పోషకాహార లోపం. దీంతో కూడా మన జుట్టు రాలిపోవడం జరుగుతుంది. దీంతో ఇరవైలోనే అరవైలా కనిపించడం మామూలే. ఆధునిక కాలంలో మనం తీసుకునే మందుల ప్రభావమే మనకు నష్టాలు తెస్తున్నాయి. జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే కచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్నది కావడం గమనార్హం. అయినా సరే తీసుకుంటామనే భరోసా ఉన్న వారు మాత్రం ఆ రకమైన ఆహారం తీసుకుంటే జుట్టు రాలడం ఆగి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Ram Column: హైదరాబాద్ విమోచన పోరాటం – అపోహలు, వాస్తవాలు
బట్టతల రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పాలు తదితర వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో అవి మన జుట్టు రాలడాన్ని అరికడతాయి. మళ్లీ కొత్త జుట్టు వచ్చేందుకు కూడా దోహదం చేస్తాయి. అందుకే వాటిని తీసుకోవడం ఉత్తమం. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బాదం పప్పులు తింటే జుట్టు ఊడిపోవడం ఆగుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంా ఉండటంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జుట్టు ఊడిపోవడాన్ని నిరోధిస్తుంది. అందుకు మన దినసరి ఆహారంలో బాదం చేర్చుకుంటే మంచిదే.

కాల్షియం లోపంతో కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. కాల్షియం లోపాన్ని నివారించుకోవాలంటే పాలు, పెరుగు, జున్ను వంటి పాల పదార్థాలను తరచుగా తీసుకోవాలి. అప్పుడే కాల్షియం పుష్కలంగా అంది మన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. తద్వారా జుట్టు రాలిపోవడం ఆగుతుంది. కాల్షియం లోపించడంతోనే ఎముకలు కూడా బలహీనంగా మారతాయని తెలుస్తోంది. దీనికి గాను పాల పదార్థాలను విరివిగా తీసుకుంటూ కాల్షియం లోపం నుంచి బయట పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఏవేవో షాంపులు వాడుతూ కూడా నష్టం తెచ్చుకుంటున్నారు. షాంపూలు కాదు మన జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టును మర్దన చేసుకోవాలి. దీంతో కుదుళ్లు బలపడతాయి. రకరకాల షాంపులు వాడి తలను పాడు చేసుకోవద్దు. చక్కగా కుంకుడు కాయరసం వాడితే ఎంతో మేలు. అలాగే తలకు నూనె పట్టించడం కూడా ముఖ్యమే. ఎవరైతే నూనె పెట్టుకోరో వారి వెంట్రుకలు ఊడిపోవడం సాధారణమే. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుని బట్టతల రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఎక్కువగానే ఉంది.
Also Read:Pawan Kalyan-TDP: ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్… టీడీపీ మాస్టర్ ప్లాన్ ఇదే!
Recommended videos:

