https://oktelugu.com/

Oscar Nominations 2023- RRR: ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో #RRR కి నో ఎంట్రీ..ఇది మాములు కుట్ర కాదు

Oscar Nominations 2023- RRR: ఈ ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా విడుదలై ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి సుమారు 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం టాప్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 21, 2022 / 07:43 AM IST
    Follow us on

    Oscar Nominations 2023- RRR: ఈ ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR సినిమా విడుదలై ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి సుమారు 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం టాప్ 3 చిత్రాలలో కూడా ఒకటిగా నిలిచింది..అంతతి అఖండ విజయం సాధించిన ఈ సినిమాకి OTT లో విడుదలైన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది..ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందిన సినీ ప్రియులు అయితే #RRR సినిమాని నెత్తిన పెట్టుకొని మరి ఆదరించారు..హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు మరియు నిర్మాతలు కూడా #RRR సినిమా లో నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ని మెచ్చుకుంటూ..రాజమౌళి దర్శకత్వ ప్రతిభని కొనియాడారు..ఇక హాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ మ్యాగజైన్ ‘వెరైటీ’ కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు ఆస్కార్ అవార్డు వస్తుందని అంచనా వేసి ప్రత్యేక కథనాలు కూడా రాసారు.

    Oscar Nominations 2023- RRR

    RRR movie

    అయితే అందరి అంచనాలు తారుమారు అయ్యాయి..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి #RRR సినిమాకి బదులుగా గుజరాత్ లో పెద్ద హిట్ గా నిలిచినా ‘లాస్ట్ ఫిలిం షో’ అనే సినిమా నామినెటే అయ్యింది..దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..#RRR సినిమాని ప్రపంచం మొత్తం గుర్తించింది..ఆర్టిస్టులు మరియు దర్శకుడి ప్రతిభను పొగడ్తలతో ముంచి ఎత్తారు కూడా..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తాని ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసిన #RRR వంటి సినిమాని ప్రభుత్వం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపకుండా విస్మరించడం పై సినీ పెద్దలు పెదవి విరుస్తున్నారు.

    Also Read: Samantha Yashoda: ఓవర్సీస్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ని దాటేసిన సమంత యశోద చిత్రం..ఇది మాములు అరాచకం కాదు

    ntr, ram charan

    ఆస్కార్ అవార్డు మా హీరో కి వస్తుంది అంటే మా హీరో కి వస్తుంది అంటూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు ఇరువురు కూడా సోషల్ మీడియా లో తరుచు ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఇరువురికి కూడా చోటు దక్కకుండా పోవడం విశేషం..సౌత్ సినిమా కాబట్టే ఇలా విస్మరించారు..అదే నార్త్ లో తెరకెక్కిన సినిమా అయ్యి ఉంటె ఇలానే నిర్లక్ష్యం చేసేవారు అంటూ భారత దేశం ప్రభుత్వం పై విరుచుకుపడుకున్నారు అభిమానులు.

    Also Read: Bigg Boss 6 Telugu బిగ్ బాస్: ఇదే టాస్క్ రా స్వామీ.. తన్నుకు చచ్చారు.. నేహా, ఆరోహిలకు గాయాలు.. ఇనాయాపై దాడికి యత్నం 

    Recommended videos:

    Tags