Homeలైఫ్ స్టైల్Saree Care Tips: చీరలు కొత్తగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Saree Care Tips: చీరలు కొత్తగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Saree Care Tips: చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో అంటూ ఓ సాంగే ఉంది..చీరల గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్.. ఆడవాళ్లకు బీరువా నిండా చీరలు ఉన్నా.. ఇంకా కావాలి అనిపిస్తుంటుంది. అలాంటి చీరలు మీరు కూడా ఎన్ని కొని ఉంటారో కదా.. భర్తలకు భార్యలకోసం.. ఆడవాళ్లకు తమ కోసం ఎవరైనా ఒకే కానీ చీరలు కొనాల్సిందే.. ఎన్ని బట్టలున్నా చీరకడితే ఆ అందమే వేరండోయ్ బాబు.. మరి ఈ చీరలు కొన్నప్పుడు ఉన్నంత కొత్తగా రోజులు మారుతున్న కొద్ది ఉండవు కదా. కానీ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

చీరలను ఎలా పడితే అలా మడతలు పెటప్టకూడదు. అంతేకాదు మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచకూడదు. అలా చేయడం వల్ల రంగు మారుతుంది. అలాగే ఉంచడం వల్ల ముడతలు కూడా పడతాయి. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. ఇక వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతుకుతున్నప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే తొందరగా పాడవుతాయి.

వాషింగ్ మిషన్ లో కొన్ని బట్టలను మాత్రమే ఉతకాలి. అన్నింటిని ఉతకడం మంచిది కాదని గుర్తు పెట్టుోండి. కొన్ని చీరలను ఉతకకుండా డ్రైక్లీనింగ్ కు ఇవ్వాలి. కొన్ని చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలో తెలుసుకొని ఉతకాలి. ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ మస్ట్. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయకూడదు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ టిప్ పాటించాలి.

ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి విడివిడిగా ఉతకాలి. చీర క్లాత్ ను బట్టి ఉతకాలి. లేదంటే ఒకదాని వల్ల మరొకటి పాడవుతుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular