Homeఎంటర్టైన్మెంట్గ్లామర్ డోర్ తెరిచేసిన కావ్య.. హాట్ పిక్స్ వైరల్

గ్లామర్ డోర్ తెరిచేసిన కావ్య.. హాట్ పిక్స్ వైరల్

 

సినిమాల్లో రాణించడమంటే మాములు విషయం కాదు. అందులోనూ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే కాస్త కష్టపడాల్సి వస్తోంది. అందచందాలతో పాటు అణకువ, ముఖ కవలిలకు చూపించే టాలెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా.. కొందరికీ అదృష్ట రేఖ సరిగ్గా లేకపోతే అవకాశాలు దరి చేరవు. కొందరు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత హీరోయిన్ గా రాణించిన వారు ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం ఒకటి,రెండు సినిమాల్లో కనిపించి ఆ తరువాత కనుమరుగైన వారున్నారు. అయితే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ అవకాశాలు రాని హీరోయిన్లలు పొట్టిపిల్ల ఒకరు. అయితే ఈబ్యూటీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ఏం చేసిందో తెలుసా?

సినీ మాయలో ఒక్కసారి పడ్డాక.. అందులో నుంచి బయటపడడం కష్టంగా ఉంటుంది. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా అవకాశాలు రావు. అయితే ఏదో ఒక సినిమాలో అవకాశాలు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అయినా ఛాన్స్ లు రాకపోవడంతో అందాల ఆరబోతపై దృష్టి పెడుతుంటారు. కొన్నాళ్లపాటు సాంప్రదాయంగా కనిపించిన వారు ఒక్కసారిగా అందాల పరదను తెంచేస్తారు. తాజాగా బలగం బ్యూటీ కూడా అదే చేసిందని తెలుస్తోంది.

‘గంగోత్రి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన కావ్య కల్యాణ్ రామ్.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే పెరిగి పెద్దయ్యాక సంగీత ప్రధాన పాత్రలో నటించిన ‘మసుద’లో కనిపించింది. ఆ తరువాత తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమాలో హీరోయిన్ చేసి టాలీవుడ్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తరువాత అమ్మడు కెరీర్ మారిపోతుందని అనుకున్నారు. కానీ ఎలాంటి మార్పులు జరగలేదు. అవకాశాలు కూడా రావడం లేదు.దీంతో ఈ భామ గ్లామర్ షో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

లేటేస్టుగా కావ్య కల్యాణ్ రావు హాట్ ఫొటోలను రిలీజ్ చేసింది. ఇందులో ఈ భామ గ్లామర్ అవతారమెత్తింది. మొన్నటి వరకు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కసారిగా  రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొందరు అవకాశాలు రావడం లేదని కావ్య ఇలా చేసిందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు హీరోయిన్ అన్నాక ఆ మాత్రం గ్లామర్ షో చేయకపోతే ఎలా? అని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram)

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular