
Gas Acidity: ప్రస్తుతం మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. పూర్వం రోజుల్లో తీసుకునే ఆహారం వల్ల లాభాలుంటే ఇప్పుడు మనం తినే ఆహారం వల్ల రోగాలు వస్తున్నాయి. చిన్న వయసులోనే రోగాలతో సహవాసం చేయాల్సి వస్తోంది. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి రోగాలు వ్యాపిస్తూ మనిషిని దెబ్బతీస్తున్నాయి. వీటితో పాటు అనేక ఇతర వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ మధ్య కాలంలో జీర్ణ సంబంధ సమస్యలు కూడా వేధిస్తున్నాయి. అందరు జంక్ ఫుడ్స్ కు దగ్గర కావడంతో ఎసిడిటి, గ్యాస్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడం లేదు.
త్రిఫల చూర్ణం
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడు కాయలతో తయారు చేసిన చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు. ఇవి ఒక్కోటి 100 రోగాలను నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి. దీంతో ఈ చూర్ణానికి ఎంతో డిమాండ్ ఉంది. ఇది అన్ని ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలకు త్రిఫల చూర్ణం దోహదపడుతుంది. దీంతో దీన్ని కడుపులోకి తీసుకోవడం వల్ల మనకు కలిగే అనారోగ్యాలను దూరం చేయడంలో ఇది కీలక పాత్ర ప పోషిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు దూరం కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఎలా వాడాలి?
త్రిఫల చూర్ణంతో పాటు తిప్పతీగ చూర్ణం మిశ్రమంగా చేసుకుని వాడుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం, ఒక టీ స్పూన్ తిప్పతీగ చూర్ణం వేసుకుని కలుపుకోవాలి. దీన్ని రోజుకు మూడు పూటలు తాగాలి. ఇలా చేయడం వల్ల 15 రోజుల్లో గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా పోతాయి. రోజుకు రెండు పూటలు పండ్లు తినాలి. ఒకపూటే ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే సులభంగా అనారోగ్య సమస్యలు దూరం కావడం సహజం.
పండ్లతో ప్రయోజనం
పండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు పూటలు పండ్లు తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు ఉండవు. అజీర్తి అసలు ఉండదు. ఇలా సులభమైన పద్ధతిలో గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు సూచించిన దాని ప్రకారం ఇలా చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఆయుర్వేద వైద్యంలో ఈ చిట్కాను చెప్పారు. అందుకే అందరు పాటించి అనారోగ్య సమస్యలను లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది.