
Mahesh Babu Sania Mirza: టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో లుక్స్ పరంగా నవ మన్మథుడు అనిపించుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.అసలు ఈయన 50 ఏళ్ళ వయస్సుకి దగ్గర పడుతున్నాడని చెప్తే ఎవరైనా నమ్ముతారా.పాలబుగ్గలతో కాంతివంతమైన చర్మంతో మెరిసిపోతూ ఉంటాడు.స్క్రీన్ మీద మహేష్ బాబు కనిపిస్తే హీరోయిన్లను కూడా చూడడం మర్చిపోతారు ఆడియన్స్.
అంత అందం ఆయన సొంతం, ఎక్కడకి వెళ్లినా తన మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరిని డామినేట్ చేసేయడం మహేష్ బాబు కి అలవాటుగా మారిపోయింది.బయటకి వెళ్ళేటప్పుడు ఆయన చాలా సింపుల్ క్యాజువల్ డ్రెస్ తోనే వెళ్తుంటాడు.పెద్దగా రెడీ అయ్యి వెళ్లడం వంటివి ఇది వరకు ఎప్పుడు మనం చూడలేదు.కానీ రీసెంట్ గా జరిగిన సానియా మీర్జా ఫేర్ వెల్ పార్టీ కి మాత్రం బ్లాక్ హూడి వేసుకొని దర్శనమిచ్చాడు.మనోడు కాస్ట్యూమ్స్ తో అడుగుపెడితేనే చూపులను ఎవ్వరూ తిప్పుకోలేరు, అలాంటిది ఇంత స్టైలిష్ వేర్ తో వస్తే ఏమైనా ఉందా!.
పార్టీ లోకి అడుగుపెట్టినప్పటి నుండి అందరి చూపు మహేష్ బాబు పైనే, పాపం సానియా మీర్జా ని ఎవ్వరూ పట్టించుకోలేదు.ఆమెని కలిసి వెంటనే మహేష్ వద్దకు వచ్చి కబుర్లు చెప్పడం, సెల్ఫీలు దిగడం వంటివి చేసారు.దీనిపై సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

పాపం సానియా మీర్జా తనకి ఎంతో దగ్గరైన వాళ్లలో ఒకరిగా భావించి మిమల్ని ఆహ్వానిస్తే , ఆమె కంటే మీరే పార్టీ లో హైలైట్ అయిపోయారు కదా,ఆమె పార్టీ ఇస్తున్నట్టు లేదు, మీరే ఇస్తున్నట్టు ఉంది అంటూ కామెంట్స్ చేసారు.ప్రస్తుతం మహేష్ బబూ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ లుక్ అంత అద్భుతంగా ఉండేలోపు పైన హుడీ వెయ్యగానే ఇంత డామినేట్ చేసే లుక్స్ వచ్చాయని అభిమానులు అంటున్నారు.ఇక ఈ పార్టీ లో మహేష్ తో పాటుగా నమ్రత కూడా చాలా అందంగా కనిపించింది.