Happy married life tips: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఇద్దరు తెలియని వ్యక్తులు ఒకే ప్రయాణం చేసేటప్పుడు ఒకరిపై ఒకరు గౌరవం.. ప్రేమ.. ఆప్యాయత.. అనుబంధం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత కాలంలో ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించాలన్న ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు. దీంతో ఎంతో కాలంగా కలిసి ఉండాలని అనుకునే ఈ బంధం పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడిపోవాల్సి వస్తుంది. భర్తపై భార్య, భార్యపై భర్త ప్రత్యేకంగా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని వాటిని పాటించడం వల్ల ఒకరి పై ఒకరికి గౌరవం ఏర్పడుతుంది. ఈ గౌరవం ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచి శాశ్వతంగా సంతోషంగా జీవించేలా చేస్తుంది. అయితే భార్య విషయంలో భర్త కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గొడవ:
భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం. ప్రతి విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది. కానీ ఎవరో ఒకరు ముందుగా సర్దుకొని ఆ గొడవను తగ్గే ప్రయత్నం చేయాలి. ఆ గొడవను పెద్దది చేసేలా మాట్లాడితే ఇద్దరికీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గొడవ గురించి మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో జరిగినా గొడవ విషయాన్ని భర్త స్నేహితులకు గాని తల్లిదండ్రులకు గాని చెప్పకుండా ఉండాలి. అలా చెబితే ఈ గొడవ మరింత పెద్దదిగా మరి చివరికి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గొడవ విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిది.
క్షమించే గుణం:
ప్రతి ఒక్కరూ ఏదో విషయంలో తప్పు చేస్తూనే ఉంటారు. అంతమాత్రాన ఆ వ్యక్తి పనికిరాడు అని అనుకోవద్దు. ఎందుకంటే తెలిసో తెలియకో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం మనుషులకే ఉంటుంది. అలా ఒకటి రెండుసార్లు అవకాశం ఇచ్చేందుకు తప్పు చేసిన వారిని క్షమించే గుణం ఏర్పాటు చేసుకోవాలి. చిన్న చిన్న తప్పులకే పెద్దగా గొడవలు చేసుకుంటే మరోసారి ఎదుటి వ్యక్తిపై నమ్మకం ఉండే అవకాశం ఉండదు.
ఇతరులతో పోలిక:
భార్యను ఎప్పుడూ ఇతరులతో పోల్చరాదు. ఒక వ్యక్తి పరిస్థితులకు అనుగుణంగా అతనికి సరైన భార్య వస్తుంది. కానీ చాలామంది ఇతర కుటుంబాలను చూసి భార్యను ఇతరులతో పోలుస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ పోల్చడం సరికాదు. ఎందుకంటే కుటుంబం అందరికీ ఒకే రకంగా ఉండదు. ఎవరి కుటుంబం వారిదే అన్నట్లుగా ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో భార్యను ఎట్టి పరిస్థితుల్లో నిందిచరాదు.
సలహా:
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్య సలహా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తికి భార్యా మాత్రమే జీవితాంతం తోడుంటుంది. ఒక్కోసారి భర్త తీసుకొని నిర్ణయాలు తప్పుడు కావచ్చు. అయితే భర్త శ్రేయస్సు కోరే భార్య మాత్రమే సరైన సలహా ఇస్తుంది. అందువల్ల ఇతరుల సలహా కంటే భార్య సలహా అనే పాటించడం మంచిది.