Teja Chitram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూత్ ఫుల్ సబ్జెక్టులను సక్సెస్ ఫుల్ గా డీల్ చేసిన వాళ్లలో తేజ ఒకరు…చిత్రం సినిమాతో బోల్డ్ కంటెంట్ తో సైతం సూపర్ సక్సెస్ ని సంపాదించొచ్చు అని తెలిసేలా చేసిన ఈ దర్శకుడు వరుస గా లవ్ స్టోరీలను చేసి తనకంటూ ఐడెంటిటి సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన డైరెక్టర్ గా మారారు. అప్పటి నుంచి ఆయనకు ఒక సపరేట్ ఐడెంటిటి వచ్చింది… ఇక కెరీర్ మొదట్లో కెమెరామెన్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత డైరెక్టర్ గా మారాల్సి వచ్చింది. ‘చిత్రం’ సినిమాని కేవలం 42 లక్షల్లో తీసి 7 కోట్ల వరకు ప్రాఫిట్స్ సంపాదించి పెట్టారట.
ఇక మొత్తానికైతే ఆ సినిమాకి ప్రతి ఒక్కరికి 11 వేలు ఇచ్చినట్టుగా తేజా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. చిన్న సినిమాతో అంత పెద్ద సక్సెస్ ని సాధించడం అనేది మామూలు విషయం కాదు. అప్పట్లో తేజ వండర్స్ చాలానే క్రియేట్ చేశాడు. ఆ టైమ్ కి ఎలాంటి జానర్స్ నడుస్తున్నాయో ఆ జానర్స్ కి విరుద్ధంగా మనం ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు మన సినిమాని చూడడానికి ఇష్టపడతారు.
దాని వల్ల ప్రేక్షకుల అటెన్షన్ సినిమా మీదికి వస్తోంది. అది చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ కొంతమంది మాత్రం ట్రెండు నడుస్తున్న రొటీన్ సినిమాలను వదిలేసి కొత్త తరహా సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్లకి బాగా కనెక్ట్ అవుతోంది. నేను అదే పంథా ను ఎంచుకొని ముందుకు సాగాను అంటే తేజ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం… ప్రస్తుతం తేజ ప్లాపుల్లో ఉన్నప్పటికీ అతనికి చాలా మంచి డిమాండ్ ఉంది.
చాలా మంది హీరోలు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తేజం మాత్రం తన వైఖరిలోనే సినిమా చేయాలని కోరుకుంటాడు. కాబట్టి అదొక్కటే తనకి మైనస్ అవుతుందని చాలా మంది సినిమా మేధావులు సైతం చెబుతున్నారు… మొత్తానికైతే తేజ లాంటి దర్శకుడు మరోసారి కంబ్యాక్ ఇస్తే చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండటం విశేషం…