
House Vastu : మనం ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా వాస్తు ఉందో లేదో చూసుకుంటాం. పక్కా వాస్తు ప్రకారం ఉండకపోతే ఇల్లు కట్టుకోవడానికి వెనకాడతాం. వాస్తు పద్ధతులు అన్ని సక్రమంగా ఉంటేనే ఇల్లు కట్టుకుంటాం. లేదంటే సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. వాస్తుకున్న ప్రాధాన్యం అలాంటిది. వాస్తు ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. వాస్తు లెక్కల ప్రకారం ఉండేలా జాగ్ర్తత్తలు తీసుకుంటున్నారు. లేకపోతే ఇల్లు నిర్మించుకోవడమే వాయిదా వేసుకుంటున్నారు. వాస్తు ప్రకారం అన్ని సక్రమంగా ఉండాలంటే వీటిని పాటించాలి.
గది ఆకారాలు
మనం నిర్మించుకునే గదుల ఆకారాలు ప్రధానమైనవి. గదుల ఆకారాలు చతురస్రం లేదా దీర్ఘ చతురాస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఎల్ ఆకారంలో కూడా ఉంచుకోవడం మంచిది. ఇలా గదుల ఎంపికలో కూడా వాస్తు చూసుకుంటాం. వాస్తు పద్ధతులు సరిగా లేకపోతే మనకు నష్టాలు వస్తాయి. అందుకే గదుల నిర్మాణం ఇలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే.
కిటికీల ఎంపిక
కిటికీల ఎంపికలో కూడా వాస్తు చూసుకోవాలి. ద్వారాలు ఎన్ని ఉంటాయో కిటికీలు కూడా అన్ని ఉండేలా చూసుకోవడం మంచిది. లేదంటే వాస్తు ప్రకారం లేనట్లే. గదులకు వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. గాలి, వెలుతురు లేని ఇల్లు కూడా వాస్తు ప్రకారం లేనట్లుగానే చూస్తారు. ఇలా వాస్తు ప్రకారం మన ఇంటికి కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.
మొక్కలు
ఇంటి ఆవరణలో మనం పెంచుకునే మొక్కలు కూడా మన వాస్తు పద్ధతులను తెలియజేస్తాయి. ఇంటి ఆవరణలో అందమైన పూల మొక్కలు ఉంటే మన ఇంటికి వాస్తు లోపం లేనట్లుగా భావించొచ్చు. ఇలా ఇంటికి కిటికీలు కూడా బాగుండేలా జాగ్ర్తత్తలు తీసుకోవడం మంచిది.
లీకేజీలు లేకుండా..
మన ఇంట్లో ఉండే నీటి పైపులు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. లీకేజీ ఉంటే మన ఇంటికి నష్టమే. అందుకే వాస్తు ప్రకారం ఇల్లు ఉండాలంటే నీటి లీకేజీలు లేకుండా జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో నీటి లీకేజీలు ఉండకుండా చూడాలి. లీకేజీలు ఉంటే వాటిని తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలి.
మెటల్ ఫర్నీచర్
ఇంట్లో ఏర్పాటు చేసుకునే ఫర్నీచర్ కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. చెక్కతో తయారు చేసిన ఫర్నీచర్ ఉంటే మంచిది. మెటల్ తో తయారు చేసినవి వాడుకుంటే ఆర్థిక ఇబ్బందులు రావడం ఖాయం. దీంతో మన ఇల్లుకు వాస్తు ప్రకారం అన్ని ఉండాలంటే మెటల్ ఫర్నీచర్ ను వాడకపోవడమే మంచిది. ఎప్పుడు కూడా చెక్కతో తయారు చేసుకున్న వాటిని తీసుకుంటే ప్రయోజనం.
ఇలా ఇంటికి వాస్తు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో వాస్తు పద్ధతులు పాటించకపోతే కష్టాలు రావడం సహజం. అందుకే వాస్తు ప్రకారం మన ఇంటిని నిర్మించుకోవడానికి మొగ్గు చూపుతాం. ఇలా వాస్తు చిట్కాలు పాటించి మన ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.