Homeఎంటర్టైన్మెంట్Toxic Theatrical Rights: కళ్ళు చెదిరే రేటుకి 'టాక్సిక్' తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్...

Toxic Theatrical Rights: కళ్ళు చెదిరే రేటుకి ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్న దిల్ రాజు!

Toxic Theatrical Right: KGF సిరీస్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తో కన్నడ హీరో యాష్(Rocking star Yash) నటించిన ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రం వచ్చే నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ సినిమాపై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గత నెలలో విడుదల చేసిన టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వయొలెన్స్ ని ఇలా కూడా చూపించొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేవిధంగా ఆ టీజర్ ఉంది. అందుకే ఆడియన్స్ […]

Toxic Theatrical Right: KGF సిరీస్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తో కన్నడ హీరో యాష్(Rocking star Yash) నటించిన ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రం వచ్చే నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ సినిమాపై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గత నెలలో విడుదల చేసిన టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వయొలెన్స్ ని ఇలా కూడా చూపించొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేవిధంగా ఆ టీజర్ ఉంది. అందుకే ఆడియన్స్ లో అంతటి అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రం మీద. కేవలం కన్నడ లో మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. మన టాలీవుడ్ లో క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం ఎల్లప్పుడూ ముందు ఉండే నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ఆయనే కొనుగోలు చేశాడు.

ఈ తెలుగు వెర్షన్ రైట్స్ ని KVN ప్రొడక్షన్స్ సంస్థ దిల్ రాజు కి అక్షరాలా 120 కోట్ల రూపాయలకు అమ్మిందని సమాచారం. మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకే ఈ రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం గగనం అయిపోయిన ఈ రోజుల్లో, కన్నడ హీరో సినిమాకు ఇంత రేట్ పెట్టి కొనడమా?, ఇది చాలా అతిశయం లాగా ఉందే?, అంత పెద్ద సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజీ కాంబినేషన్ చిత్రం ‘కూలీ’ నే 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు, అలాంటిది యాష్ చిత్రం థియేట్రికల్ రైట్స్ 120 కోట్లా?, ఇది పబ్లిసిటీ కోసం దిల్ రాజు చేసిన చీప్ స్టంట్స్ లాగా ఉందని విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ దిల్ రాజు నిజంగా అంత రేట్ పెట్టి కొనుగోలు చేసుంటే, కనీసం 90 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లుతుందని అంటున్నారు నెటిజెన్స్.

‘టాక్సిక్’ కి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న విషయం వాస్తవమే. కానీ ‘కూలీ’, ‘కాంతారా 2’ ని మించి అయితే కాదు కదా?, కనీసం ఆ సినిమాల క్రేజ్ కి దరిదాపుల్లో కూడా ఉండదు ఈ చిత్రం. అలాంటి సినిమాకు ఇంత పెట్టి కొన్నారంటే నమ్మడానికి మేము ఏమైనా ఎర్రి వాళ్ళం లాగా కనిపిస్తున్నామా?, పైగా బిజినెస్ ని చాలా క్యాలికులేటెడ్ గా చేసే దిల్ రాజు మార్కెట్, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి తెలిసి అంత పెట్టి కొన్నాడంటే ఎవ్వరూ నమ్మరని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ ట్రైలర్ చిత్రం పై అంచనాలు మరింత పెంచుతుందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper