Homeక్రీడలుHarry Brook: 13 కోట్ల బ్రూక్.. బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు

Harry Brook: 13 కోట్ల బ్రూక్.. బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు

Harry Brook
Harry Brook

Harry Brook: సన్ రైజర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్ జూలు విదిల్చాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో 55 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. హైదరాబాద్ జట్టు ఈ ఆటగాడి కోసం రూ.13.25 కోట్లు వెచ్చించింది. వరుస మూడు మ్యాచ్ ల్లో విఫలమైనా.. తాజా మ్యాచ్ లో విధ్వంసం సృష్టించి తానెంతటి ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ నో ప్రత్యర్థి జట్లకు తెలియజేశాడు.

హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, విజయ శంకర్ వంటి కీలక ప్లేయర్లను వదులుకుంది. కానీ అనూహ్యంగా ఈ ఏడాది వేలంలో బ్రూక్ ను రూ.13.25 రూపాయలకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. మొదటి మూడు మ్యాచ్ ల్లో ఘోరంగా ఈ బ్యాటర్ విఫలమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మేలిమి బంగారం లాంటి బ్యాట్స్మెన్లను వదులుకొని చెత్తను టీమ్ లోకి తీసుకువచ్చారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా బ్రూక్ కు చెల్లించిన మొత్తంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. అంతటి ఆట ఎప్పుడు వస్తుందో బయటికి అంటూ చెలోక్తులు పలువురు విసిరారు.

మెరుపు బ్యాటింగ్ తో సంకేతం..

బ్రూక్ పై కొన్ని రోజుల నుంచి వస్తున్న విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పాడు. మూడు ఇన్నింగ్స్ ల్లో విఫలమైనా.. నాలుగో మ్యాచ్ లో కేకేఆర్ జట్టుపై విధ్వంసం సృష్టించాడు బ్రూక్. ఏకంగా ఈ మ్యాచ్ లో 12 ఫోర్లు, మూడు సిక్సులతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ కు సంబంధించిన ఏ బౌలర్ ను విడిచిపెట్టలేదు. వచ్చిన బౌలర్ కు వచ్చినట్టుగా సిక్సులు, ఫోర్లు బాది విధ్వంసాన్ని సృష్టించాడు.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని..

కేకేఆర్ జట్టు బౌలర్ సుయాష్ శర్మ తప్పిదం వల్ల బ్రూక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వాస్తవానికి పదో ఓవర్ సుయాష్ బౌలింగ్ చేశాడు. అతను ఆ ఓవర్ రెండో బంతిని గూగ్లీ వేశాడు. బ్రూక్ దాన్ని నేరుగా బౌలర్ వైపు కొట్టాడు. బంతి సుయాష్ చేతులకు తగిలి బయటకు వెళ్ళింది. అతను బంతిని పట్టుకోలేకపోయాడు. సుయాష్ చేసిన ఈ ఒక్క తప్పు బ్రూక్ కి ప్రాణం పోసింది. ఆ తరువాత బ్రూక్ ను అపడం ఎవరి తరం కాలేదు. చివరి వరకు గ్రీజులో నిలిచి హైదరాబాదు జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసేలా చేశాడు. అతనితోపాటు మార్క్రమ్ కూడా అర్థ సెంచరీతో అదరగొట్టాడు.

Harry Brook
Harry Brook

తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్..

ఈ మ్యాచ్ లో బ్రూక్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 12 వంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఆండ్రి రస్సెల్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ ఓవర్లలో కాస్త నెమ్మదించాడు. 32 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత లాకి ఫెర్గ్యూషన్ వేసిన ఓవర్లో బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవర్ తర్వాత అతను స్కోర్ 55 నుంచి 77 పరుగులకు చేరుకున్నాడు. ఏకంగా 22 పరుగులు రాబట్టుకున్నాడు. ఈ దశ నుంచి కేకేఆర్ బౌలర్లు అతన్ని పూర్తిగా ఆపలేకపోయారు. ఈ బ్యాట్స్ మెన్ తన అరంగేట్రం సీజన్ లోనే సెంచరీ కొట్టడం విశేషం.

అత్యంత సామర్థ్యం కలిగిన బ్యాట్స్ మెన్..

ఇంగ్లాండ్ కు చెందిన బ్రూక్ అత్యంత సామర్థ్యం కలిగిన బ్యాట్స్ మెన్. తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సమర్థత బ్రూక్ సాంతం. ఇంగ్లాండ్ జట్టుకు అనేకసార్లు ఈ తరహా విజయాలను అందించాడు. అందుకే హైదరాబాద్ జట్టు భారీ మొత్తాన్ని వెచ్చించి బ్రూక్ ను సొంతం చేసుకుంది. మొదటి మూడు మ్యాచ్ ల్లో విఫలమైనప్పుడు అనేక విధాలుగా విమర్శలు వచ్చాయి. అంత ఒత్తిడిలోనూ భారీ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు బ్రూక్.

RELATED ARTICLES

Most Popular