Homeపండుగ వైభవంLord Shiva: మనకు శుభం కలగాలంటే శివుడి ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలో తెలుసా?

Lord Shiva: మనకు శుభం కలగాలంటే శివుడి ఎలాంటి ఫొటోలు పెట్టుకోవాలో తెలుసా?

Lord Shiva: అందరం శివభక్తులమే. ఈశ్వరుడిని కొలిస్తేనే మనకు ఎంతో ఊరట లభిస్తుంది. భోళా శంకరుడు అడిగిన వెంటనే వరాలిస్తాడు. అందుకే శివయ్యను అందరు నిత్యం కొలుస్తుంటారు. ఇంకా ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా శివపూజలే చేస్తారు. శివుడికే ఉపవాసం ఉంటారు. తమ కోరికలను నెరవేర్చే తండ్రికి అన్ని పూజలు చేయడం ఆనవాయితీ. దీంతో శ్రావణమాసంలో వచ్చే సోమవారాలకు విశిష్టత ఉంటుంది. శివుడిని మనసారా కోరుకుంటూ నైవేద్యాలు పెట్టి అభిషేకాలు చేస్తుంటారు. తమ కష్టాలను కడతేర్చు దేవా అంటూ వేడుకుంటారు. జీవితంలో ఎత్తుకు ఎదగాలని ఏవో కోరికలు కోరుకుంటూ తీర్చాలని అడుగుతారు.

Lord Shiva
Lord Shiva

మనం ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో శివుడి ప్రతిరూపం ఉంచుకోవాల్సిందే. లేకపోతే పూజలు చేయడం కష్టమవుతుంది. అందుకే శివ ప్రతిమ తెచ్చుకుని ఫొటో రూపంలోనో విగ్రహ రూపంలోనే ఇంట్లో పెట్టుకుంటారు. నిత్యం దానికి పూజలు చేస్తుంటారు. దాన్ని అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకోవడం తెలిసిందే. కానీ మన ఇంట్లో దేవుడి ఫొటోలు ఎక్కడ ఉండాలి. ఏ దిశలో ఉంచితే ప్రయోజనం కలుగుతుంది తదితర విషయాలు కూడా తెలుసుకుని పాటిస్తే అన్ని రకాల లాభాలు కలుగుతాయి.

Also Read: NITI Aayog- KCR: కేసీఆర్ కు కౌంటర్ కోసం ఏకంగా నీతి అయోగ్ నే దిగిందే?

ఇంట్లో శివుడి ఫొటో ఎలా ఉండాలి అనే దానిపై కూడా వాస్తు ప్రభావం ఉంటుందట. శంకరుని ఫొటో ఆగ్రహంతో ఉన్నది ఉండకూడదు. నవ్వుతో ఉండే ఫొటోను ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ఇంకా మనకు మంచి జరగాలంటే శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు కలిసి ఉన్న కుటుంబ ఫొటో ఉంచుకుంటే ఇంకా మంచి జరుగుతుందని విశ్వాసం. ఆగ్రహంతో నాట్యం చేసే ఫొటో కూడా ఉండకూడదు. నవ్వుతో తపస్సు చేసుకునే ఫొటో ఉంటే ఇంటిల్లిపాదికి క్షేమం కలుగుతుందని చెబుతుంటారు.

Lord Shiva
Lord Shiva

వాస్తు ప్రకారం చూస్తే ఇంట్లో ఆగ్రహంతో నాట్యం చేసే నటరాజు విగ్రహం కూడా ఉండకూడదు. ఏదైనా నవ్వుతో కూడిన ఫొటోలు, విగ్రహాలు ఉంటేనే మనకు మేలు కలుగుతుంది. వాస్తు ప్రకారం చూసుకుని మన ఇంటికి సరిపోయే రీతిలో ఫొటోలు, విగ్రహాలు అమర్చుకోవడం చేసుకోవాలి. దేవుడిని మన ఇంటిలో మంచి ప్రదేశంలో ఉంచుకుని మంచి జరిగేందుకు దోహదపడేలా దేవుళ్ల ఫొటోలు పెట్టుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనకు లాభం కలుగుతుందని తెలుస్తోంది.

Also Read:YCP- Gorantla Madhav Issue: కష్టం వచ్చిన ప్రతీసారి వైసీపీ డైవర్షన్ ప్లాన్.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై అదే స్కెచ్?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular