Height: దేశంలో చాలామంది వయస్సుకు తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల తక్కువ ఎత్తు సమస్యతో బాధ పడుతున్నారు. సాధారణంగా పిల్లలు 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. 20 సంవత్సరాల వయస్సు తర్వాత ఎత్తు పెరిగే అవకాశాలు అంతకంతకూ తగ్గుతాయి. ఎత్తు అనేది వంశపారంపర్య లక్షణమే కాగా తీసుకునే ఆహారం కూడా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

పిల్లలు ఎత్తు పెరగాలంటే నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పిల్లలకు సరైన ఆహారం అందేలా చూసుకోవాలి. ఎముకల ఆరోగ్యంపై ఆధారపడి ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తే కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు శరీరానికి సరైన స్థాయిలో అందాలి. బాదం, పిస్తా, పప్పుధాన్యాలను తీసుకోవడంతో పాటు గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం ద్వారా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
పాలు, పెరుగు, పనీర్, ఆకుకూరల ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం లభించే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం అరలీటర్ కు పైగా పాల పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం లభించే అవకాశం ఉంటుంది. మినరల్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎత్తు సహజంగా పెరగవచ్చు. అరగంట సమయం ఎండలో తిరగడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.
రోజుకు కనీసం 2,000 కేలరీల శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవడం ద్వారా ఎత్తు పెరగడంతో పాటు శరీరానికి అవసరమైనంత బరువు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. స్రెచ్చింగ్ వ్యాయామాల వల్ల శరీరం ఫిట్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్సర్ సైజ్ చేయడం గ్రోత్ హార్మోన్ల పనితీరు మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి.