Morning Mistakes: వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయాన్నే వారి వారి ముఖాన్ని అద్దంలో చూసుకోవటం, తమ నీడను తామే చూడటం అశుభం. ఉదయం నీడను చూడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వ్యక్తి లోపలికి ప్రవేశిస్తుంది. నీడను చూసినప్పుడు వ్యక్తి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. నెగిటివ్ శక్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. ఉదయం పూట సొంత నీడను చూడటం వాస్తులో నిషేధం.
మనలో చాలామందికి ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాలా సార్లు తమ మొహం చూసే అలవాటు ఉంటుంది. కానీ నిద్రలేచిన వెంటనే మొహం చూసుకోవడం మంచిదా కాదా? అలా చూసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అనే వివరాలు తెలుసుకుందాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చూసుకోవడం చాలా అశుభం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. దీని వల్ల మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుందట. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖాన్ని అద్దంలో చూసుకోవద్దట.
జీవితంలో సమస్యలు పెరిగే సమస్యలు ఉన్నాయట. అందుకే పడకగదిలో అద్దం ఉండకూడదు అంటున్నారు. ఉదయాన్నే అద్ధం చూసుకోవడం ఆల్మోస్ట్ బ్యాన్ చేయాలి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు అద్దం చుట్టూ ప్రతికూల శక్తి ఉంటుందట. దీనివల్ల ఉదయం లేవగానే మొహం చూసుకోవడానికి అద్దం చూసుకుంటే ప్రతికూల శక్తుల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుందట. ఈ ఫలితం వల్ల అలసట, ఒత్తిడి వస్తుంటుంది. ఇక అద్దంలో ఉదయమే చూసుకోవడం వల్ల మనసుకు ఆటంకం కూడా కలుగుతుందట.
ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో చూస్తే మొటిమలు, నెరిసిన జుట్టు, ముడతలు, మచ్చలు వంటివి కనిపిస్తుంటాయి. వీటివల్ల వ్యక్తిలో ఆత్మ విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా ఉంది. మరి తెలుసుకున్నారు కదా ఉదయం లేవగానే అద్దం ఎందుకు చూడకూడదో.. తస్మాత్ జాగ్రత్త.