Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సామాన్యుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఒకే ఒక్కడు చిరంజీవి… ఈయన చేసిన సినిమాలు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇక చిరంజీవి ఇన్స్పిరేషన్ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి అసాధ్యమైన పనిని అయిన సరే సుసాధ్యం చేసి చూపించొచ్చు అని నిరూపించిన నిత్య శ్రామికుడు చిరంజీవి…
ఇక ఈయన సినిమాలు చేయడమే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి వాటిని స్థాపించి సామాన్య మానవులకు సైతం తనదైన సేవలను అయితే అందిస్తూ వస్తున్నాడు. ఇక ఇదే కాకుండా కరోనా సమయంలో సిసిసి అనే సంస్థ ను స్థాపించి పేద ప్రజలందరికీ అండగా నిలబడ్డాడు. ఆయన చేసిన సేవలు జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదిలా ఉంటే 2006వ సంవత్సరంలో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఇక అప్పటినుంచి కూడా తమదైన సేవలను చేస్తూ ముందుకు సాగుతున్న చిరంజీవికి ప్రస్తుతం భారతదేశం లోనే రెండోవ అత్యున్నత పురస్కారమైన “పద్మ విభూషణ్” వరించింది.
మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఆయన 150కు పైన సినిమాలు చేసినప్పటికీ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యం తో ఈ ఏజ్ లో కూడా ఆయన మొఖానికి మేకప్ వేసుకొని నటించడానికి రెడీ అవుతున్నాడు. తన డెడికేషన్ చూస్తుంటే ప్రతి ఒక్కరు ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో కూడా మరొక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తూ కూడా ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయడానికి తను ఇప్పటికీ కూడా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నాడు…