Relatives Move Away: బంధువులు దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా?
అందమైన జీవితం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కొందరు అందవికారమైన పనులు చేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాంప్రదాయ విలువలు, పురాతన పద్ధతులను పాటించకపోవడంతో నేటి పిల్లలకు అది అలవాటైపోయి బంధాలు, బంధుత్వాలు మరిచిపోతున్నారు.
Relatives Move Away: అందమైన జీవితం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కొందరు అందవికారమైన పనులు చేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాంప్రదాయ విలువలు, పురాతన పద్ధతులను పాటించకపోవడంతో నేటి పిల్లలకు అది అలవాటైపోయి బంధాలు, బంధుత్వాలు మరిచిపోతున్నారు. దీంతో అమ్మానాన్న తప్ప వారికి ఎవరూ కనిపించడం లేదు.. కుటుంబం అంటే అమ్మానాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ , మేనమామ, బామ్మర్థి… వీళ్లంతా ఉంటారు. కానీ ఒంటరి జీవితం బెస్ట్ అని కొందరు అనుకోవడంతో వీరితో బంధుత్వాన్ని కట్ చేయించుకుంటున్నారు. ఇదే పరిస్థితి పిల్లలు కూడా పాటించడంతో వారికి బంధుత్వాల గురించి తెలియక అయోమయానికి గురవుతున్నారు. అసలు బంధువులతో ఎందుకు ఉండాలి? బంధుత్వాలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
‘మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లు.. ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లు నలుగురు లేకపోతే ఆ జీవితమే దండగ’ అని ఓ సినిమాలో హీరో చెబుతాడు. అంటే ప్రతీ వ్యక్తి తాను జీవిస్తే చాలు అని అనుకోకుండా బంధువులు, చుట్టాలను కలుపుకుపోతూ వారితో సరదాగా ఉండాలి. ఒకరినొకరు సాయం చేసుకోవాలి. ఫంక్షన్లకు, కార్యక్రమాలకు కలుస్తూ ఉండాలి. ఆపద వచ్చినప్పుడు వారికి సాయం చేయాలి. అయితే ఇలా బంధుత్వం కొనసాగిస్తే ఏం జరుగుతుంది?
నేటి కాలంలో ఎవరినీ నమ్మడానికి వీలు లేదు. ఎవరు ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో బంధువులతో కలిసి మెలిసి ఉండడం వల్ల నమ్మకం పెరుగుతుంది. ఏదైనా ఒక విషయం బంధువులతో చర్చించడం వల్ల నిజనిర్దారణలు తెలుస్తాయి. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు మాట్లాడే విషయంలో బంధువులతో చర్చించడం వల్ల చాలా మంది సాయం చేస్తారు. ఒక్కోసారి బంధువులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే చిన్న చిన్న తప్పులకు బంధువులను దూరం చేసుకోవడం వల్ల నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మనసు బాగా లేని సమయంలో బంధువులను కలవడం వల్ల ప్రశాంతంగా మారుతుంది. అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చే వారిని చిన్న విషయాలకే దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు.
నేటి కాలం చిన్ని పిల్లలు ఎక్కువగా సిటీల్లో పెరుగుతున్నారు. దీంతో వీరు ఒంటరి లైఫ్ తో ఉంటున్నారు. ఈ క్రమంలో బంధాలకు దూరం అవుతున్నారు. అయితే వారికి తల్లిదండ్రులు బంధాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. బామ్మర్ది, మేనమామ, నానమ్మ, తాతయ్య ఇలా బంధాల గురించి తెలియజేయండి. వారితో అప్పుడప్పుడు కలిసి ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి. ఏదో కార్యక్రమంలో వారితో కొన్ని రోజుల పాటు కలిసి ఉండండి. ఇలా చేయడం వల్ల పాత కాలంలో పాటించిన పద్దతులు తెలుస్తాయి. ఇవి జీవితానికి తోడ్పడుతాయి.
పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు లేకపోతే బంధువులతో కలిసి విహార యాత్రలకు వెళ్లండి.. కనీసం నెలలో ఒకరోజైనా బంధువుల ఇంటికి వెళ్లండి.. వారి గురించి పిల్లలు చెబుతూ వారితో ఎలాంటి బంధుత్వం ఉందో చెప్పండి. ఇలా మనం అనుకున్న వాళ్లు మనతో నలుగురు లేకపోతే ఆ జీవితమే వ్యర్థం అవుతుంది. బంధువులు లేనివాళ్లు కొత్త బంధాలను సృష్టించుకోవచ్చు. అయితే ఇవి వారికి అనుగుణంగా ఉండాలి.