https://oktelugu.com/

AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక.. ఏపీ సర్కార్ అలెర్ట్

రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి భారీ హెచ్చరిక వచ్చింది. నాలుగు రోజులు పాటు వర్షాలు తప్పవని తేల్చి చెప్పింది. దీంతో రైతుల్లో భయాందోళన నెలకొంది.

Written By: , Updated On : November 26, 2024 / 10:44 AM IST
Heavy Rains In AP

Heavy Rains In AP

Follow us on

AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. రేపటికి ఇది తీవ్ర వాయుగుండం గా మారనుంది. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావం ప్రధానంగా దక్షిణ, ఉత్తర కోస్తాలో ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. కోస్తాంధ్ర పై ప్రభావం చూపనుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. ప్రస్తుతానికి వాయుగుండం డ్రీం కోమలికి 600 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి 880 కిలోమీటర్ల, పుదుచ్చేరికి 980 కిలోమీటర్లలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అటు తరువాత వాయువ్యదిశగా శ్రీలంక తీరాల వైపు వెళ్ళనుంది.

* రాయలసీమ పై ప్రభావం
రాయలసీమపై సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో సైతం వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ వాయుగుండం ప్రభావంతో తీరంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అందుకే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వివరించారు.

* రైతుల్లో ఆందోళన
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలనిఅధికారులు సూచిస్తున్నారు.ధాన్యం తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వపరంగా విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.