Okra Benefits: బెండకాయలను రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇలా బెండకాయ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రం అవుతుంది. అల్సర్ తగ్గుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. ఫైబర్, విటమిన్ ఇ, సి, కె, మెగ్నిషియం, పాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా అందడం వల్ల మన దేహానికి ఎంతో మేలు కలుగుతుంది. దీంతో చక్కని పోషణ అందుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

Written By: Srinivas, Updated On : July 13, 2023 12:38 pm

Okra Benefits

Follow us on

Okra Benefits: మనం తినే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఇది సీజన్ తో పని లేకుండా అన్ని కాలాల్లో దొరుకుతుంది. బెండకాయ రుచిగా ఉంటుంది. దీంతో మనకు చాలా లాభాలున్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు ఉండటం వల్ల మన దేహానికి ఎంతో మేలు చేస్తుంది. బెండకాయను ఎలా తినాలో కూడా సూచిస్తున్నారు. ఆరోగ్యం బాగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్లాసు నీటిలో..

రెండు బెండకాయలను కడిగి మొదటి చివరి భాగాలు కట్ చేయాలి. ఒక్కో బెండకాయను నిలువుగా కోసి చివరి భాగం వరకు ాటు పెట్టండి. రెండు బెండకాయలను ఓ గ్లాసు నీటిలో వేయండి. రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరునాడు ఉదయాన్నే గ్లాసులో నుంచి బెండకాయలను తీసి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

జీర్ణాశయం

ఇలా బెండకాయ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రం అవుతుంది. అల్సర్ తగ్గుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. ఫైబర్, విటమిన్ ఇ, సి, కె, మెగ్నిషియం, పాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా అందడం వల్ల మన దేహానికి ఎంతో మేలు కలుగుతుంది. దీంతో చక్కని పోషణ అందుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

మధుమేహం

మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు బలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. కంటి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.