Health Tips: మనలో చాలా మందికి టీ, కాఫీల అలవాటు ఉంటుంది. టీ తాగనిదే ఉండలేకపోతున్నారు. అంతగా టీకి ఆకర్షితులయ్యారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం కనీసం ఓ ఐదారు టీలు తాగుతూ కాలయాపన చేయడం అందరికి అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో టీ తాగకుండా ఏ పని చేయడం లేదు. టీ, కాఫీలు తాగుతూ ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఫలితంగా ఎసిడిటీ సమస్యకు గురవుతున్నారు. ఏం తినకుండా టీ తాగితే అల్సర్ కూడా ఇబ్బంది పెడుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదు.

భారతీయులకు టీతో అనుబంధం పెనవేసుకుపోయింది. ఉదయాన్నే వేడి టీ తాగనిదే ఏం తోచదు. సరదాగా బయటకు వెళ్లినప్పుడు టీ తాగుతూ టైంపాస్ చేయడం కామనే. టీ తాగడం వల్ల మనకు కొన్ని లాభాలున్నా నష్టాలు సైతం ఉన్నాయని తెలుసుకుంటే మంచిది. టీ తాగే ముందు మంచినీళ్లు తాగడం వల్ల మంచి జరుగుతుంది. టీ, కాఫీలు తాగే ముందు వాటర్ తాగడం వల్ల మనకు లాభాలున్నాయి. టీ తాగే ముందు నీళ్లు తాగే ముందు నీళ్లు తాగకపోతే పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.
టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. టీ తాగడానికి 10-15 నిమిషాల ముందు నీళ్లు తాగడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. టీ, కాఫీలు తాగితే దంతాలు పాడవుతాయి. ఇవి తీసుకోక ముందు నీళ్లు తాగడం వల్ల ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఖాళీ కడుపుతో టీ తాగితే కడుపుకు హాని కలుగుతుంది. ఎసిడిటి సమస్య వేధిస్తుంది. దీంతో వాటిని తీసుకునే ముందు నీరు తాగితే అలాంటి సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.

టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య రాదు. శరీరంలో పోషకాలకు ఎలాంటి డోకా ఉండదు. టీ, కాఫీలు తాగే ముందు మంచినీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. టీ, కాఫీలతో ప్రొటీన్లు ఏం అందకున్నా అవి తాగడానికి అందరు మొగ్గు చూపుతున్నారు. ఉదయం లేవగానే కడుపులో కాసిన్ని చాయ నీళ్లు పడనిదే ఏం తోచదు. ఈ నేపథ్యంలో టీ, కాఫీలు తాగడం వల్ల మన నరాల్లో ఉత్తేజం పెరిగి కొత్త ఉత్సాహం పెరుగుతుంది. టీ, కాఫీలు తాగడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.