KCR- Jagan: “నర్సంపేట ఎపిసోడ్ తర్వాత ప్రగతి భవన్ వైపు వెళ్లిన షర్మిల కాన్వాయ్ ని తెలంగాణ పోలీసులు నిలువరించారు. ఆమె కూర్చున్న వాహనాన్ని టోయింగ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. దీనిపై ప్రధానమంత్రి స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశం సందర్భంగా నీ సోదరిని అలా లాక్కుని వెళ్తుంటే మీకు బాధ అనిపించలేదా? అని జగన్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించడాన్ని అంత ఆషామాషీగా తీసుకోలేం. రాజకీయ ప్రయోజనం లేకపోతే ప్రధానమంత్రి ఈ అంశాన్ని అంత ముఖ్యమైన సమావేశం వద్ద ఎలా ప్రస్తావిస్తారు? కేంద్రాన్ని ధిక్కరిస్తే నొప్పి ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కనుక, తన సోదరిని బిజెపి పెద్దలు రాజకీయంగా ఎలా ఉపయోగించుకున్నా నోరెత్తలేరు. ప్రస్తుతానికి జగన్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కేంద్ర పెద్దలు వచ్చే ఎన్నికల వరకు అదే వైఖరితో ఉంటారని చెప్పలేం”
ఇదీ రాధాకృష్ణ ఆవేదన. విశ్లేషణ.. నిజమే షర్మిల పట్ల కెసిఆర్ ప్రభుత్వం నిజంగానే వ్యవహరిస్తుంది.. రాష్ట్ర గవర్నర్ తమిళ సైనే ఇబ్బంది పెట్టకుండా విడిచిపెట్టని ప్రభుత్వం ఇది. ఆఫ్టరాల్ షర్మిల. ప్రధాని మోడీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను బూతులు తిట్టే పార్టీ అది.. బీఆర్ఎస్ ధోరణే అంత. కవితపై గెలిచిన అరవింద్ ఇంటికి వెళ్లి నానా రచ్చ చేసింది.. కవిత అయితే చెప్పుతో కొడతానని వ్యాఖ్యానించింది.. ఆ పార్టీ నుంచి విలువలు ఎక్స్పెక్ట్ చేయలేం.

కెసిఆర్ ను నిలదీయాలా?
మోడీ అడిగిన దాని ప్రకారం.. “ఏయ్ కేసీఆర్ మా చెల్లి పట్ల ఏమిటి ఈ దుర్మార్గ వైఖరి అంటూ ఆవేశపడలా”? ఏం చేసి ఉండాల్సిందని ఆర్కే అభిప్రాయం? చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర పోలీస్ బెటాలియన్లను అలర్ట్ చేసి తెలంగాణ మీదకు దూసుకు రావాలా? హా హా హా… ఏపీ నేతలు ఇక్కడే ఉంటారు. హైదరాబాదులోనే వారికి వ్యాపారాలు ఉన్నాయి. తెలంగాణ నేతలకు ఆంధ్రప్రదేశ్లో పని లేదు.. పైగా కేసీఆర్ కు కోపం వస్తే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే నిశ్శబ్దంగా ఉంటారు.. సజ్జల వంటి నాయకులు కలిసి ఉంటే కలదు సుఖము అంటూ సూక్తి ముఖ్తావలి చెప్పేది అందుకే
బిజెపి నాయకులకు ఆ సోయి ఉందా
మీ చెల్లెలి పట్ల కెసిఆర్ దమన వైఖరి ప్రదర్శిస్తుంటే నీ స్పందన ఏమిటి అని జగన్ ను మోది అడిగాడట. కెసిఆర్ ఒకవైపు బిజెపి ముఖ్య నేతల బట్టలు విప్పేసి.. బజారులో నిలబెడుతుంటేనే, కేసులు పెట్టి తోముతుంటేనే మోడీషా పెద్దగా మాట్లాడటం లేదు.. అయినప్పటికీ ఆర్కే భాషలో జగన్, షర్మిల వేరు కదా.. ఇద్దరికీ అసలు పడదు కదా. మరి అలాంటప్పుడు షర్మిల పట్ల కెసిఆర్ అనుచిత వైఖరికి జగన్ ఎందుకు స్పందించాలి.. పైగా పొలిటికల్ గా ఆమె పోరాడుతుంది కదా. కానీ అవేవీ ఆర్కే కు కనిపించవు.. అన్నింటికీ మించి తన పేపర్లో షర్మిలకు ఏ స్థాయిలో కవరేజ్ ఇస్తున్నాడో చూస్తున్నాం కదా.. గతంలో ఆమె అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తే ఇదే రాధాకృష్ణ అసలు పట్టించుకోలేదు.. ఇప్పుడు టాప్ ప్రయారిటీగా వార్తలు పబ్లిష్ చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటో తెలియని పిచ్చోళ్ళు కాదు జనాలు.
ఇద్దరి మధ్య ప్రేమ
కేసీఆర్ అంటే జగన్ కు… జగన్ అంటే కెసిఆర్ కు మస్తు ప్రేమ ఉంది అంటాడు ఆర్కే. అలాంటప్పుడు షర్మిల విషయంలో కెసిఆర్ ను ఎందుకు ఆక్షేపిస్తాడు? నిజానికి షర్మిల తెలంగాణ పార్టీ ఇప్పటికీ ఒక మిస్టరీ.. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఆమె మీద దూకుడు ప్రదర్శించడం కూడా ఒక మిస్టరీ.. నిజంగా మోడీ జగన్ ను నిలదీశాడా? తను షర్మిల కి ఫోన్ చేశాడా? అది కూడా మిస్టరీనే. ఆమె మీద సానుభూతి పెరిగితే బిజెపికి ఏం ఫాయిదా? తెలంగాణ వేదికగా చోటుచేసుకుంటున్న మిస్టరీ రాజకీయాల గుట్టు ఏమిటో? దీని గురించి ఆర్కే కూడా సరిగా చెప్పడు..

ఏమిటో ఈ మిస్టరీ రాజకీయాలు. వాస్తవానికి షర్మిల ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. ఆమె ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో తెలుసు.. జగన్ సైలెంట్ గా ఉన్నంత మాత్రాన తెర వెనుక జరిగే టివి తెలియదు అనుకుంటే పొరపాటే. అదే లెక్కన షర్మిల ప్రజల కోసమే పోరాడాలి అనుకుంటే, ఆమె అనుకుంటున్న రాజన్న సంక్షేమ రాజ్యం తీసుకురావాలి అనుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లోనే ఒక పార్టీ పెట్టొచ్చు.. కానీ ఆమె అలా చేయదు.. అలా ఎందుకు చేయమని ఆర్కే అడగడు. ఎందుకంటే లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక..