https://oktelugu.com/

Kashi Visheweshar Temple: కాశీ విశ్వేశ్వర ఆలయంలో లింగానికి ఎదురుగా నంది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Kashi Visheweshar Temple: సాధారణంగా మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది. ఈ క్రమంలోనే ఆలయానికి వెళ్ళిన భక్తులు ముందుగా నంది దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇకపోతే మన దేశంలో ఉన్న అన్ని ఆలయాలలో ఇదే కొనసాగుతోంది.కానీ 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో మాత్రం స్వామి వారి లింగానికి ఎదురుగా నంది కనిపించదు. ఇలా కాశీవిశ్వేశ్వర ఆలయంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2022 4:07 pm
    Follow us on

    Kashi Visheweshar Temple: సాధారణంగా మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది. ఈ క్రమంలోనే ఆలయానికి వెళ్ళిన భక్తులు ముందుగా నంది దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇకపోతే మన దేశంలో ఉన్న అన్ని ఆలయాలలో ఇదే కొనసాగుతోంది.కానీ 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో మాత్రం స్వామి వారి లింగానికి ఎదురుగా నంది కనిపించదు. ఇలా కాశీవిశ్వేశ్వర ఆలయంలో శివలింగానికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

    kasi-viswanath

    kasi-viswanath

    పూర్వం ఔరంగజేబు భారతదేశంపై దండెత్తి భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను కూల్చివేశారు. ఈ దండ యాత్రలో భాగంగా ఔరంగజేబు అతని సైన్యం కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం పై దండయాత్ర చేశారు.ఇలా తన సైన్యం మొత్తం ఆలయాన్ని కూల్చి వేస్తున్న క్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారు శివలింగాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న బావిలో పడేసారు. అయితే అప్పటికీ స్వామివారి లింగానికి ఎదురుగా నంది ఉంది. ఇలా ఔరంగజేబు సైన్యం సగం ఆలయాన్ని కూల్చివేసినప్పటికీ నందిని మాత్రం కూల్చి వేయలేదు.

    ఈ క్రమంలోనే దండయాత్ర అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు బావిలో శివలింగం కోసం ఎంత ప్రయత్నించినా దొరకకపోవడంతో అదే శివలింగం పోలికతో ఉన్న మరొక శివలింగాన్ని తయారుచేసి కొత్తగా ఆలయాన్ని నిర్మించి ఆలయంలో స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ శివ లింగం ముందు నంది లేకపోయినప్పటికీ పాత ఆలయంలో ఉన్న నందిని భక్తులు దర్శించుకుంటారు.అదేవిధంగా బావిలో స్వామివారి లింగం ఉందన్న నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ బావికి కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.