https://oktelugu.com/

Nagachaitanya: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అంద‌రి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్ట‌లు..

Nagachaitanya: సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య మొహంలో నవ్వు మాయమైంది. పెద్దగా బయట కనిపించడమే మానేశాడు. సామ్‌తో రిలేషన్ మర్చిపోయేందుకు గ్యాప్ తీసుకున్న చైతూ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. సమంత కూడా ఇండస్ట్రీలో చాలా బిజీబిజీగా మారిపోయింది. అయితే, చాలా రోజుల తర్వాత నాగచైతన్య ఫేస్‌లో నవ్వులు విరబూసాయి. బంగార్రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా తండ్రి నాగార్జున స్టేజ్ పై మాట్లాడుతుండగా చైతూ మాత్రం సైలెంట్‌గా తాజా చిత్రంలో వన్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 12, 2022 / 01:05 PM IST
    Follow us on

    Nagachaitanya: సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య మొహంలో నవ్వు మాయమైంది. పెద్దగా బయట కనిపించడమే మానేశాడు. సామ్‌తో రిలేషన్ మర్చిపోయేందుకు గ్యాప్ తీసుకున్న చైతూ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. సమంత కూడా ఇండస్ట్రీలో చాలా బిజీబిజీగా మారిపోయింది. అయితే, చాలా రోజుల తర్వాత నాగచైతన్య ఫేస్‌లో నవ్వులు విరబూసాయి. బంగార్రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా తండ్రి నాగార్జున స్టేజ్ పై మాట్లాడుతుండగా చైతూ మాత్రం సైలెంట్‌గా తాజా చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్‌తో కొంత పేపు రొమాన్స్ పండించాడు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో ఎలాగైనా పండుగకు హిట్ కొట్టాలనే కసితో బంగార్రాజు సినిమాను జనవరి 14న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది. నాగార్జున నటించిన 100వ సినిమా కావడంతో ఈ మూవీ విజయంపై గంపెడాశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన మూవీకి బంగార్రాజు సీక్వెల్. ఈ సినిమాలో చైతన్య బంగార్రాజుకు మనువడిగా నటించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ చైతూకు నానమ్మగా కనిపించనుంది. నానమ్మ పాత్ర చేస్తున్నా సీనియర్ నటి రమ్యకృష్ణ మాత్రం గ్లామర్ రోల్‌లో కనిపించనుంది.

    Also Read:  మ‌ళ్లీ వైసీపీని టార్గెట్ చేసిన ఆర్జీవీ.. స‌డెన్ గా ఏంటీ ట్విస్టు..

    దర్శకుడు కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఓవైపు నాగార్జున స్టేజీపై మాట్లాడుతుండగా మరోవైపు తనయుడు అక్కినేని నాగ చైతన్య మాత్రం తన చూపులతోనే రొమాన్స్ పండించాడు. బంగార్రాజు సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో ఒకరైన దక్ష నగర్కార్‌తో చైతన్య చాలా చిలిపిగా ప్రవర్తించాడు.

    ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నాగ చైతన్య కామన్‌గా అలా వెనక్కి తిరిగి చూడటంతో దక్ష కూడా అతన్ని చూసింది. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చిలిపిగా నవ్వుతూ కనిపించారు. చాలా నేచురల్‌గా వీరిద్ధరి మధ్య రొమాన్స్ సీన్ క్రియేట్ అయ్యింది. సామ్ నుంచి దూరం అయ్యాక చాలా రోజులకు చైతూ మొహంలో నవ్వు కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ స్పూఫ్ చూస్తే.. నవ్వాపుకోలేరు (వీడియో)..!

    Tags