History Of The Christmas Tree: క్రైస్తవులు జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్. క్రిస్మస్ రోజున క్రిస్టియన్స్ అందరు క్రీస్తును తలచుకొని ప్రార్థనలు చేస్తుంటారు. డిసెంబర్ 25న క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రైస్తవులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ పండుగకు కొన్ని రోజుల ముందే క్రైస్తవులు తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ లను, క్రిస్మస్ స్టార్ లను తెచ్చుకొని విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు.
Also Read: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందులే!
క్రైస్తవులు ఇలా తమ ఇళ్లను ట్రీ లతో, స్టార్లతో అలంకరించుకోవడానికి వెనుక కొన్ని దైవ రహస్యాలు ఉన్నాయి. ఇక క్రిస్మస్ రోజు క్రైస్తవులంతా చర్చిలో ప్రార్థనలు చేసుకొని ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటుంటారు. ఈ పద్ధతి ఎప్పటి నుండో ఉంది. మరి క్రిస్మస్ ట్రీ వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే.. ఒకప్పుడు ఒక ఊరిలో ప్లాబో అనే పేద పిల్లవాడికి కానుకగా తీసుకెళ్లడానికి తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవటంతో తన ఇంటి ముందు ఉన్న ఒక అందమైన మొక్కను పూల కుండీలో పెట్టుకొని చర్చికి తీసుకెళ్లాడు.
ఇక ఆ మొక్కను తీసుకెళ్లి క్రీస్తు ముందు ఉంచాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా అతడు తెచ్చిన బహుమతిని చూసి ఎగతాళిగా నవ్వారు. ఆ సమయంలో ఆ చెట్టు బంగారు చెట్టు గా మారిపోవడంతో అక్కడున్న వాళ్లంతా తల దించుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈ చెట్టును ప్రతి క్రిస్మస్ రోజు క్రీస్తు ముందు అలంకరించి పెట్టడం ఆనవాయితీగా మారింది. అలా రాను రాను ఆ చెట్టుకు కొన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించడం ప్రారంభించారు.
Also Read: డిసెంబర్ 31లోపు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులు ఇవే?