Village Cooking Channel: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందరు కూడా తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ బాగా ఫేమస్ అయిపోతున్నారు.తమ క్రియేటివిటీ ని ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు.ఇంస్టాగ్రామ్,యూట్యూబ్ లలో వీడియోలు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్న వారిలో విలేజ్ కుకింగ్ ఛానల్ వారు కూడా ఒకరు.వీరు విభిన్నరకాలైన వంటల వీడియోలను చేస్తూ సబ్స్క్రైబర్ లను ఆకట్టుకుంటున్నారు.వీరు చేసిన వంటల వీడియోలకు 100 మిలియన్స్ వ్యూస్ తెచ్చుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసారు.అయితే ఇలా యూట్యూబ్ ఛానెళ్ల వారు ఉపయోగించే కెమెరాలు ఎలా ఉంటాయో…వాటి ధర ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
యూట్యూబ్ వీడియోలు చేసేందుకు చాలా మంది ఐఫోన్ లను ఉపయోగిస్తూ ఉంటారు.4 కే రిజల్యూషన్ ఉన్న కెమెరాలు కూడా ఉపయోగిస్తారు.కెమెరాలలో డీఎస్ ఎల్ ఆర్ కెమెరాలు,డిజిటల్ సినిమా కెమెరాలు,ఫిల్మ్ కెమెరాలు,ఇన్స్టంట్ కెమెరాలు ఇలా పలు రకాలు ఉంటాయి.అయితే యూట్యూబ్ వీడియొ లు ఎఫెక్టివ్ గా ఉండాలని 8 కె రిజల్యూషన్ ఉన్న కెమెరాలు వాడతారు చాలా మంది.విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ వారు కూడా సినిమా షూట్ చేసేందుకు వాడే 8 కె రిజల్యూషన్ ఉన్న రెడ్ రాఫ్టర్ కెమెరాను ఉపయోగిస్తారు.
దీని ధర రూ.40 లక్షలు ఉందని తెలుస్తుంది.ఇది అత్యంత శక్తివంతమైన మరియు అధునాతనమైన సినిమా కెమెరా.ఈ కెమెరా లో వీడియొ క్వాలిటీ సినిమా రేంజ్ లో ఉంటుంది కాబట్టి యూట్యూబర్లు ఎక్కువగా ఈ కెమెరా ను ఉపయోగిస్తారు.వీడియొ క్వాలిటీ బాగుంటేనే వీడియోలకు అధికంగా వ్యూస్ వస్తాయి కనుక ఈ కెమెరాలను వాడతారు.