Devara: కల్కి బాటలోనే నడుస్తున్న దేవర… అక్కడుంది ప్రభాస్ కాబట్టి అది హిట్ అయింది.. మరి దేవర పరిస్థితి ఏంటి..?

రాజమౌళితో సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకొని, ఆ తర్వాత సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఏకైక హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు కొరటాల శివ ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికైతే ఎలాంటి హైప్ అయితే లేదు. ఇక కల్కి సినిమా మీద కూడా మొదట్లో భారీ హైప్ అయితే లేదు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఎక్కువగా ప్రమోషన్స్ కూడా నిర్వహించలేదు.

Written By: Gopi, Updated On : July 10, 2024 3:15 pm

Devara

Follow us on

Devara: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతుందనే విషయాన్ని మేకర్స్ ముందుగానే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు మొదటి పార్ట్ ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడట.

ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంటే రీసెంట్ గా ఆ సాంగ్ ని కూడా కంప్లీట్ చేసినట్టుగా సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది. ఇక ఇప్పటినుంచి ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఏడు సక్సెస్ లను అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతాడు. అలాగే పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుకున్న హీరోగా నిలుస్తాడు.

ఇక దీంతో పాటుగా రాజమౌళితో సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకొని, ఆ తర్వాత సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఏకైక హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు కొరటాల శివ ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికైతే ఎలాంటి హైప్ అయితే లేదు. ఇక కల్కి సినిమా మీద కూడా మొదట్లో భారీ హైప్ అయితే లేదు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఎక్కువగా ప్రమోషన్స్ కూడా నిర్వహించలేదు.

మరి దేవర సినిమా యూనిట్ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. కల్కి సినిమా ప్రమోషన్స్ ఏమీ చేయకపోయినా కూడా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. మరి దేవర సినిమా పరిస్థితి అలా కాదు. ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోతే మాత్రం భారీగా దెబ్బతినే అవకాశాలైతే ఉన్నాయి…