Andhra Pradesh: వాహనదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంతో వాహనదారులకు ఊరట లభించనుంది.ఇంతకీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలమైన నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ముందుకు దూసుకొని వెళ్తుంది.ఇప్పుడు ఇదే క్రమంలో వాహనదారులకు సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
రవాణా శాఖకు సంబంధించిన సేవలు అన్ని కూడా ఒక చోట నుంచే అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సేవలు కూడా వినియోగించుకోవాలని భావిస్తుంది.ఒక్క వెబ్ సైట్ నుంచే వాహన సేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.ఇప్పటికే వాహనదారులకు భారత ప్రభుత్వం వాహన్ పోర్టల్ ను అందించింది.ఈ పోర్టల్ ద్వారా అన్ని వాహన సేవలను ఒకే చోట నుంచి పొందవచ్చు.
ఈ కేంద్ర ప్రభుత్వం వెబ్ సైట్ నుంచే ఏపీ వాహన సర్వీసులు కూడా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.మొదటి సారిగా ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా వాహన్ వెబ్ సైట్ సేవలను ప్రారంభిస్తున్నారు.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకోని రానున్నారు.ఈ-ప్రగతి వెబ్ సైట్ స్తానం లో వాహన్ వెబ్ సైట్ తీసుకురావడానికి అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహన్ వెబ్ సైట్ లో ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన రవాణా శాఖ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఏపీ రవాణా శాఖ సేవలు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో లేవు.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఏపీ రవాణా శాఖ సర్వీసులు కూడా కేంద్ర వాహన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండేలా సన్నాహాలు చేస్తుంది.పరివాహన్ పేరు తో ఉండే ఈ కేంద్ర వెబ్ సైట్ లో పలు రాష్ట్రాల రవాణా శాఖ సేవలు పొందవచ్చు.ఇక త్వరలోనే ఏపీ రవాణాశాఖ సర్వీసులు కూడా ఈ వెబ్ సైట్ నుంచి పొందవచ్చు అని తెలుస్తుంది.