Natya Samrat Nataraju: జనరల్‌గా నాట్యం నేర్చుకునే వారు అందరూ కంపల్సరీగా నాట్య సామ్రాట్‌ను పూజిస్తుంటారు. నాట్య సామ్రాట్‌ను గురువుగా మాత్రమే కాకుండా దేవుడిగానూ కొందరు పూజిస్తుంటారు. నటరాజు విగ్రహం చూసిన తర్వాత నాట్యం నేర్చుకుంటుంటారు. ఇకపోతే నటరాజ విగ్రహం ఏదేని నాట్యమండలిలో కంపల్సరీగా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

నాట్య పోటీలతో పాటు నాట్యం ప్రారంభించే చోట స్టేజీలపైన కంపల్సరీగా నటరాజ విగ్రహాలను పూజిస్తుంటారు. అలా నటరాజ విగ్రహానికి పూజలు చేసిన తర్వాతనే నాట్యం ప్రారంభిస్తుంటారు. ఇకపోతో ఈ నాట్యం నేర్చుకునేందుకుగాను గురువులు కంపల్సరీ. నాట్యం చేసే ముందర ప్రతీ ఒక్కరు కంపల్సరీగా నటరాజును పూజించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పరమానందానికి సూచీక అయిన నాట్యం.. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.
పరమానంద స్వరూపుడు అయిన పరమేశ్వరుడు పరమానందాన్ని ప్రాణ కోటి అందరికీ అందించగలడు అనే అర్థం నాట్యంలో ఉంటుందని నమ్మకం. ఈ క్రమంలోనే నటరాజును పూజిస్తుంటారు. అయితే, నటరాజు కిందర ఒక మరుగుజ్జు బొమ్మ ఉండటం మనందరం చూసే ఉంటాం. పరమేశ్వరుడి కురులు గాలిలో ఓ వైపున ఎగురుతుండగా మరో వైపున మరుగుజ్జు బొమ్మపైన నిలబడి ఉంటాడు రుద్రుడు. అలా పరమశివుడు కాలు కింద ఉన్న మరుగుజ్జున తొక్కుతూనే నాట్యం చేస్తుంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..
Also Read: ప్రస్తుతం జరిగే పెళ్లిల్లో చేస్తున్న పెద్ద పొరపాట్లు ఏమిటో తెలుసా?
భోళా శంకరుడు నిలబడి ఉన్న ఆ మరుగుజ్జు అపస్మార పురుషుడు.. అపస్మార పురుషుడు అనగా మానవులలోని అజ్ఞాని అని అర్థం. ఆ మనిషిని అనగా అజ్ఞానిని ప్రళయ రుద్రుడు తన తాండవంతో జ్ఞానిని చేస్తాడని భక్తుల నమ్మకం. తన శివ తాండవంతో అపస్మార పురుషుడి అజ్ఞానాన్ని, అహంకారాన్ని శివుడు అణచి వేస్తాడు. శివుడి కుడి వైపున వెనుక ఉండే చేతిలో ఢమరుకం, ముందు ఉండే చేయి అభయ ముద్రను సూచిస్తాయి. ఇకపోతే శివుడి చేతిలో ఉండేటువంటి డమరుకం క్రమబద్ధమైన లయానిత్వ స్థితిని సూచిస్తుంది. శివుడి పాదాల కింద ఉండేటువంటి పద్మం పునర్జన్మకు ప్రతీకగా పెద్దలు చెప్తుంటారు. అలా శివుడు నాట్యసామ్రాట్ రూపంలో దర్శనమివ్వడం చోళుల కాలం నుంచి ఉందని పెద్దలు వివరిస్తున్నారు.
Also Read: శ్రీగంధం సాగుతో సులువుగా లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?