KCR Politics: ఏదో జరుగుతోందబ్బా… రాజకీయ చాణక్యుడు కేసీఆర్ చర్యలు అనూహ్యం అంటారు. ఆయన చర్యలు ఊహకు అందవు.. అంతలా రాజకీయ అడుగులు ఉంటాయి. ఢిల్లీ వెళ్లినప్పుడు మోడీ, షాలతో రాసుకుపూసుకు తిరుగుతాడు.. తెలంగాణ గల్లీలో లోకల్ బీజేపీ నాయకులతో పోట్లాడుతాడు.. కేసీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక ప్రతిపక్షాలు జుట్టు పీక్కుంటాయి. కానీ తెరవెనుక సంగతులన్నీ జరిగిపోతుంటాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కేసీఆర్ సర్కార్ అరెస్ట్ చేయడం ఆయనకు.. బీజేపీకి ఫుల్ మైలేజ్ ను తెచ్చిపెట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోకస్ అవుతున్న వేళ జరిగిన ఈ పరిణామం నిజంగానే కాంగ్రెస్ వాదుల్లో అనుమానాలకు తావిస్తోంది.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఫైట్ అంతా ప్రణాళికలో భాగంగానే అవగాహనతో జరుగుతోందని అంతా భావిస్తున్నారు. రెండు పార్టీలు కలిసే ఈ తంతు చేస్తున్నాయని అనుమానిస్తున్నారు.
అటు బీజేపీకి.. ఇటు టీఆర్ఎస్ కు ఉన్న ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ ను మట్టికరిపించాలనే.. ఆ రెండు పార్టీల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ను తెలంగాణలో ఎదగకుండా ఇలా చేస్తోందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారట..
ఇటీవల సీఎం కేసీఆర్ తన నిఘా వర్గాల ద్వారా సీక్రెట్ సర్వే చేయించారని.. ఆ నివేదికలో అధికార టీఆర్ఎస్ పై తీవ్రంగా వ్యతిరేకత ఉందని బయటపడిందట.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేలినట్లు సమాచారం. దీంతో బీజేపీని ఎలాగైనా పైకి లేపి అదో సగం.. టీఆర్ఎస్ సగం సీట్లు సాధిస్తే రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చని కేసీఆర్ ఈ స్కెచ్ గీశారని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ చేయించిన సీక్రెట్ సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ కు 75-83 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలిందట.. చాలా చోట్ల టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందని నివేదిక చెప్పిందట..
అయితే ఇది నమ్మశక్యంగా లేకున్నా.. ఇదే వాస్తవం అని తేలితే అటు టీఆర్ఎస్ కు.. ఇటు బీజేపీకి రెండింటికీ దెబ్బనే.. కాంగ్రెస్ కు అధికారం సొంత కావడం రెండు పార్టీలకు మింగుడు పడని వ్యవహారం.
ఇటీవలే న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత.. బీజేపీ అగ్రనేతలతో చర్చించి వ్యూహం ఖరారు చేశారని.. ఈ వ్యూహం ప్రకారమే ధాన్యం సేకరణ అంశంలో టీఆర్ఎస్.. బీజేపీని రెచ్చగొట్టాలని.. అది రెండు పార్టీల మధ్య పోరుకు దారితీస్తుందని ప్లాన్ వేసినట్లు సమాచారం.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీ ఎదగాలనే బండి సంజయ్ అరెస్ట్ సహా ఆ పార్టీకి వ్యతిరేకంగా గులాబీ దండు వ్యవహరిస్తోందని సమాచారం. ప్రజలు కాంగ్రెస్ ను విస్మరించి బీజేపీ వైపు మొగ్గు చూపేంత హైప్ రావాలంటే ఈ మాత్రం చేయాలని స్కెచ్ గీసినట్టు సమాచారం.
ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోయినా బీజేపీని ఎదుర్కోవడం సులభమని కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే రేవంత్ పై తిరుగుబాటు చేసేందుకు కాంగ్రెస్ లోని జగ్గారెడ్డి, భట్టి తదితరులతో సహా అందరినీ కేసీఆర్ ఎగదోయబోతున్నాడని సమాచారం. కాంగ్రెస్ ను అంతర్గత పోరులోకి నెట్టి ఆ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు.
ఇదే సమయంలో తెలంగాణలోని మెజారిటీ సీట్లను గెలుచుకునేంత బలం బీజేపీకి లేదు. అదే కాంగ్రెస్ కు రాష్ట్రమంతా క్యాడర్ బలం ఉంది. అందుకే కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీజేపీని లేపితేనే బెటర్ అని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే ఈ వ్యూహం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.