Walking Benefits: మనం ఆరోగ్యంగా ఉండటానికి పలు మార్గాలు అన్వేషిస్తుంటారు. రోజు వాకింగ్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే అందరు విధిగా నడక సాగిస్తున్నారు. రోజుకు ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలో తెలుసుకుంటే మంచిది. రోజుకు కనీసం మూడు నిమిషాల పాటు నడిస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహం వస్తోంది. దీంతో జీవితకాలం మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వాకింగ్ ఈ రెండు రోగాలకు మంచి మందులా పనిచేస్తుందని తెలియడంతో అందరు నడక కొనసాగిస్తున్నారు.

ఐదు నిమిషాలు నడిస్తే మానసిక పరిస్థితి బాగుంటుంది. మనలో చాలా మంది మానసిక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. దీని నుంచి కాపాడుకోవడానికి రోజులో ఐదు నిమిషాలు నడక సాగిస్తే ప్రయోజనమే. 5-10 నిమిషాలు నడిస్తే మనలో సృజనాత్మకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సృజనాత్మకత లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నడక కొనసాగిస్తే లాభమే. భోజనం చేసిన తరువాత రోజుకు ఓ పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
తిన్న తరువాత ఓ ముప్పై నిమిషాలు నడిస్తే బరువు తగ్గుతారు. అది నడక వేగాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా వేగంగా నడిస్తే మనలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజు నలభై నిమిషాలు నడవడం వల్ల గుండె సంబంధ సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్న మాట వాస్తవమే. దీంతో హృదయ సంబంధ రోగాలను నియంత్రణలో ఉంచుకోవాలంటే నడక మంచిదే. రోజు తొంబై నిమిషాల పాటు నడిస్తే ఒత్తిడి దూరం అవుతుంది.

రోజు క్రమంత తప్పకుండా వాకింగ్ చేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఉదయం పూట నడక కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలిక రోగాల నుంచి బయట పడేందుకు నడక చాలా మంచిదని విశ్వసిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నడుస్తుంటే ఎంతో ఫలితం ఉంటుంది. ప్రస్తుతం అందరి అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజు నడిస్తేనే ఎన్నో లాభాలుండటంతో నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం నడకతో చాలా ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.