Beard Benefits : గడ్డం పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో.. మీకు తెలుసా?

గడ్డం ఎక్కువగా పెంచుకోవడం వల్ల యూవీ కిరణాల నుంచి విముక్తి పొందవచ్చు. అధికంగా గడ్డం ఉండటం వల్ల ఆ ప్లేస్‌లో ఉండే చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడి గాలుల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అలాగే చర్మంపై దుమ్ము, ధూళి చేరకుండా చేయడంతో పాటు మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది.

Written By: Srinivas, Updated On : October 24, 2024 2:19 pm

Beard Benefits

Follow us on

Beard Benefits :  అబ్బాయిలకు గడ్డం ఉంటేనే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు అయితే గడ్డం ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే చాలా మంది అబ్బాయిలు కూడా అసలు షేవ్ చేసుకోకుండా గడ్డం పెంచుతూనే ఉంటారు. అయితే ఇలా జుట్టు ఎక్కువగా ఉంటే పెద్దలకు నచ్చదు. షేవ్ చేసుకుని ఉంటేనే ఇంట్లో వారికి నచ్చుతుంది. లేకపోతే రోజూ దీని గురించి చెబుతూనే ఉంటారు. మరికొందరు అంత గడ్డం పెంచడం ఏం బాగాలేదని, ప్రేమలో ఫెయిల్ అయ్యావా అని అడుగుతారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మగవాళ్లకు గడ్డం వల్లే అందం వస్తుందని యువత ఎక్కువగా భావించి పెంచడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే గడ్డం పెంచడం అంత సులువేం కాదు. హెయిర్‌కి ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో.. గడ్డానికి కూడా అలానే తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే గడ్డంలో క్రిములు ఉండిపోతాయి. కాబట్టి వారానికి కొకసారి అయిన షాంపూ, కండీషనర్‌తో గడ్డాన్ని వాష్ చేయాలి. అవసరమైతై డైలీ శుభ్రం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదే. చాలా మంది గడ్డాన్ని పెంచుకోవడానికి కొన్ని ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇదిలా ఉండగా గడ్డం పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా పూర్తి ఆర్టికల్ చదివేయండి.

గడ్డం ఎక్కువగా పెంచుకోవడం వల్ల యూవీ కిరణాల నుంచి విముక్తి పొందవచ్చు. అధికంగా గడ్డం ఉండటం వల్ల ఆ ప్లేస్‌లో ఉండే చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడి గాలుల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అలాగే చర్మంపై దుమ్ము, ధూళి చేరకుండా చేయడంతో పాటు మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల వంటి సమస్యల నుంచి కూడా విముక్తి చెందవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే గడ్డం ఉన్నవారికి ఆత్మవిశ్వాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గడ్డాన్ని పూర్తిగా అలా వదిలేయకుండా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే గడ్డం విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ తేమగా ఉండకూడదు. గడ్డం పెంచుకోవడానికి ప్రొడక్ట్స్ వంటివి వాడటమే కాకుండా ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ శాతం మంది గడ్డం ఆరోగ్యంగా ఉండటానికి జామాయిల్, యూకలిప్టస్ వంటి నూనెలు వాడుతారు. వీటిని వాడటం వల్ల గడ్డం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గడ్డం ఉన్నవారితో పోలిస్తే లేని వారిలో ఎక్కువగా శ్వాసకోశ సంబంధాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. గాలిలో ఉండే బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో గడ్డం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే చలికాలంలో చలి నుంచి కాపాడుతుంది. సూర్యరశ్మి నుంచి వచ్చే కాంతి కిరణాల నుంచి కాపాడటంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధికారక ప్రమాదాల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.