Branded Underwear : బ్రాండెడ్ లో దుస్తులు కొనుగోలు చేస్తున్నారా.. అయితే అమ్మాయిలు మీకు ఈ సమస్యలు తప్పవు!

`మహిళలు ఎక్కువగా ఉపయోగించే బ్రాండెడ్ లో దుస్తుల్లో విషపూరిత రసాయనాలు ఉన్నాయని ఇటీవల కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆసియా, హంగేరి, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్‌లలోని మహిళలు ధరించే లో దుస్తులపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎండోక్రైన్‌కి అంతరాయం కలిగించే హానికర రసాయనాలు ఉన్నాయని తేలింది.

Written By: S Reddy, Updated On : October 24, 2024 2:28 pm

Branded Underwear

Follow us on

Branded Underwear :  అమ్మాయిలకు లో దుస్తులు అనేవి తప్పనిసరి. శరీర ఆకృతి సరిగ్గా, అందంగా కనిపించాలంటే తప్పకుండా లో దుస్తులు వాడాలి. అయితే అమ్మాయిలు ధరించే దుస్తులు బాండ్రెడ్ వాడుతారో లేదో తెలియదు. కానీ లో దుస్తులు మాత్రం తప్పకుండా బ్రాండెడ్ వాడుతారు. ఎందుకంటే లో దుస్తులు ఎంత ఫిట్‌గా, సరిగ్గా ఉంటేనే ఫ్రీగా ఉంటారని ఎక్కువగా బ్రాండెడ్ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే ఎక్కువ రోజులు మన్నిక రావాలని కొందరు ఈ బ్రాండెడ్ లో దుస్తులు కొంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొందరు భావిస్తారు. కానీ వీటివల్లే అనారోగ్య బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ రేటు గల లో దుస్తుల్లో కంటే ఎక్కువ రేటు ఉండే బ్రాండెడ్ లో దుస్తుల్లోనే హానికర రసాయనాలు ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మరి దీనివల్ల బ్రాండెడ్ లో దుస్తుల వల్ల కలిగే అనారోగ్య నష్టాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

మహిళలు ఎక్కువగా ఉపయోగించే బ్రాండెడ్ లో దుస్తుల్లో విషపూరిత రసాయనాలు ఉన్నాయని ఇటీవల కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆసియా, హంగేరి, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్‌లలోని మహిళలు ధరించే లో దుస్తులపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎండోక్రైన్‌కి అంతరాయం కలిగించే హానికర రసాయనాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా ప్లాస్టిక్ తయారీలో ఎక్కువగా ఉపయోగించే సింథటిక్ కెమికల్స్‌ అయిన బిస్ ఫినాల్స్ ఇందులో ఉన్నాయని తేలింది. ఇవి మహిళలు శరీర అనారోగ్యానికి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ రేటు ఉండే చీప్ లో దుస్తుల కంటే బ్రాండెడ్ దుస్తుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మహిళల లో దుస్తులను ఎక్కువగా సింథటిక్ పదార్థాలతోనే తయారు చేస్తారని పరిశోధకులు తెలిపారు.

ఈ లో దుస్తుల్లో ఉపయోగించే రసాయనాల వల్ల మహిళలు పిల్లలు పుట్టే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హానికరమైన రసాయనాల వల్ల కంటికి హాని కలుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల అనారోగ్యం, చర్మ సంబంధిత సమస్యలు, హార్మోన్ల మార్పులు, జీవక్రియ అనారోగ్యం వంటి సమస్యలన్నీ కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే కేవలం మహిళల లో దుస్తుల్లోనే కాకుండా పిల్లలు ఎక్కువగా వినియోగించే బాటిల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి వస్తువుల తయారీలో కూడా కెమికల్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని ఆహారాలను ప్యాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి ప్లాస్టిక్ వాటిలో కూడా హానికరమైన సింథటిక్ ప్లాస్టింగ్ ఉన్నట్లు పరిశోధకుల గుర్తించారు. తెలియకుండా వీటిని వాడుతున్నారని.. అధికంగా వీటిని వినియోగించడం వల్ల పిల్లలు కూడా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి రసాయనాలు ఉండే హానికరమైన వాటిని వాడకపోవడం మంచిది. ఎక్కువగా స్టీల్ వాటర్ బాటిల్స్, తక్కువ బ్రాండ్ ఉండే లో దుస్తులను వాడటం మంచిది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.