Coconut : కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు, ముక్కలు కూడా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఎక్కువ మంది కొబ్బరి నీరు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. డైలీ కొబ్బరి నీరు తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు బాడీ వేడి కాకుండా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి కూడా విముక్తి కల్పించడంలో కూడా కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. కొందరు ఈ కొబ్బరితో పచ్చడి కూడా చేస్తారు. ఈ పచ్చడి తినడానికి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తింటారు. అయితే అందరు ఎక్కువగా పచ్చి కొబ్బరిని మాత్రమే వినియోగిస్తారు. కానీ ఎండు కొబ్బరిని వినియోగించే వారు చాలా తక్కువగా ఉంటారు. ఈ ఎండు కొబ్బరిని తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని చాలా తక్కువ మంది మాత్రమే తింటారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఎండు కొబ్బరిని డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఎండు కొబ్బరి చిన్న ముక్కను తింటే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు అంటున్నారు. మరి నిద్రపోయే ముందు ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరిలాగే ఎండు కొబ్బరి కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నచ్చుతుంది. కానీ చాలా తక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు చిన్న ముక్క ఎండు కొబ్బరిని తింటే హాయిగా నిద్రపోతారు. అసలు నిద్రలేమి మీ దరిదాపుల్లో కూడా ఉండదు. కొందరు గ్యాస్ట్రిక్, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యల నుంచి విముక్తి చెందాలంటే నిద్రపోవడానికి అరగంట ముందు చిన్న కొబ్బరి ముక్కను తినాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని తాగితే తినే ఫుడ్ బాగా జీర్ణం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎండు కొబ్బరిలో బాగా ఫైబర్ ఉంటుంది. దీనిని తినడం వల్ల మలబద్ధకం నుంచి పూర్తిగా విముక్తి చెందవచ్చు.
రాత్రి తినడం ఇష్టం లేని వారు రోజులో ఏదో ఒక సమయంలో ఎండు కొబ్బరిని చిన్న ముక్క తినడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే చర్మం కాంతిమంతంగా తయారై అందంగా కనిపిస్తారు. ఉదయం పూట కొబ్బరి ముక్కను తినడం వల్ల నీరసం, అలసట వంటివి లేకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. దీంతో తొందరగా బరువు కూడా తగ్గుతారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, బోలు ఎముకలు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఎండు కొబ్బరితో గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ కారకాలను కూడా నిరోధించడంలో ఎండు కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎండు కొబ్బరి మార్కెట్లో దొరుకుతుంది. దీనిని డైరెక్ట్‌గా తినడం ఇష్టం లేని వాళ్లు కూరల్లో కూడా వాడుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.