
Alum Jaggery : మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో పటిక బెల్లం కూడా ఒకటి. ఎండాకాలంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది. వేడికి విరుగుడుగా దీన్ని వాడుతారు. దీన్ని మిశ్రి లేదా ఇండియన్ రాక్ షుగర్ అని పిలుస్తారు. తెలుగు వాకిళ్లలో దీనికి విలువ ఎక్కువే. చక్కెర, చెరుకు రసంతో పోలిస్తే పటిక బెల్లంతోనే ప్రయోజనాలు మెండుగ ఉంటాయి. చక్కెరకు బదులు పటిక బెల్లం ఉపయోగించడం వల్ల లాభాలు ఎక్కువగా దక్కుతాయి.
మూడు రోగాలకు చెక్
ఇది మూడు రకాల రోగాలకు చెక్ పెడుతుంది. వాత, పిత్త, కఫ రోగాలకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీంతో శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పానీయాల్లో పంచదారకు బదులు పటిక బెల్లం వేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్షణ శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పటిక బెల్లంతో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థ
జీర్ణ వ్యవస్థ మెరుగు కోసం ఇది ఎంతో దోహదపడుతుంది. ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి ఇది తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల కోసం దీన్ని వాడుకోవచ్చు. ఐరన్, పాస్పరస్ వంటివి ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన లాభాలు ఉంటాయి.
ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది
మన శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో గ్లైసిరైసిస్ అనే సమ్మేళనం ఉంటుంది. దీంతో మన ఆరోగ్యం దెబ్బతినకుండా సాయపడుతుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని విరివిగా వాడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయనడంలో సందేహం లేదు. పటిక బెల్లం వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.