https://oktelugu.com/

JD Lakshminarayana- KCR: కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాడా?: సిబిఐ మాజీ జేడీ పొరబడ్డాడు

JD Lakshminarayana- KCR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం ప్రకటించిన ఆసక్తి వ్యక్తీకరణలో బిడ్ దాఖలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి అధికారులను ఆదేశించారు. దీంతో అప్పటినుంచి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలు మొదలయ్యాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అబద్ధాలు మాట్లాడుతూ వాటిని ప్రచారం చేసుకుంటున్నారు. సరే ఇవన్నీ రాజకీయాల్లో సహజమే అనుకున్నప్పటికీ అసలు విషయాలను దాచి, […]

Written By: , Updated On : April 15, 2023 / 03:09 PM IST
Follow us on

JD Lakshminarayana- KCR

JD Lakshminarayana- KCR

JD Lakshminarayana- KCR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం ప్రకటించిన ఆసక్తి వ్యక్తీకరణలో బిడ్ దాఖలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి అధికారులను ఆదేశించారు. దీంతో అప్పటినుంచి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలు మొదలయ్యాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అబద్ధాలు మాట్లాడుతూ వాటిని ప్రచారం చేసుకుంటున్నారు. సరే ఇవన్నీ రాజకీయాల్లో సహజమే అనుకున్నప్పటికీ అసలు విషయాలను దాచి, జనాలను ఇరు రాష్ట్రాల నాయకులు రెచ్చగొడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది.

అటు హరీష్, కేటీఆర్ చెబుతున్నట్టు, ఇటు అప్పల రాజు, పేర్ని నాని అంటున్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం పిలిచింది ప్రైవేటీకరణలో భాగంగా అమ్మకపు బిడ్లు కానే కావు.. కేవలం ముడి పదార్థాల సరఫరా, దానికి బదులుగా స్టీల్ స్వీకరణకు ఆసక్తి వ్యక్తి కరణ. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాలు ఇందులో పాల్గొనేందుకు అవకాశం లేదు.. ఈ ప్రకారం చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఇందులో ప్రవేశించే అవకాశం లేదు. దానికి ఆ దమ్ము కనుక ఉండి ఉంటే మూతపడిన ఫ్యాక్టరీలను ఎప్పుడో తెరచి ఉండేది. ఇప్పుడు కెసిఆర్ జాతీయస్థాయిలో చక్రాలు తిప్పాలి కనుక, ఆంధ్రప్రదేశ్లో తనకు పొలిటికల్ లాభం కావాలి కనుక.. కొత్త అవతారం ఎత్తాడు. తన నమస్తే తెలంగాణలో స్టీల్ ప్లాంట్ రక్షకుడిగా ఆవిర్భవించాడు. వాస్తవానికి మిగతా పార్టీల నాయకులకు ఇది చేతకావడం లేదు.

JD Lakshminarayana- KCR

JD Lakshminarayana

కెసిఆర్ లో రాజకీయం తాలుకు గడుసుతనం ఎక్కువ కాబట్టి ఒక అడుగు ముందుకే వేస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది సిబిఐ వంటి సంస్థకు జాయింట్ డైరెక్టర్గా పనిచేసి, జగన్, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారి కేసులను డీల్ చేసిన జెడి లక్ష్మీనారాయణ వంటి మాజీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు.. వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను ఒకసారి పరిశీలిస్తే.. వీరు అలాంటి పెద్ద పెద్ద కేసుల్ని ఎలా దర్యాప్తు చేశారా అనిపిస్తుంది. కెసిఆర్ మడమ తిప్పని పోరాటం చేయడం వల్లే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిందంటూ లక్ష్మీనారాయణ ధన్యవాదాలు చెప్పడం నిజంగా హాస్యాస్పదం. పైగా ఇది అతడిపై సానుభూతి కలిగించే అంశం. వాస్తవానికి కేంద్ర మంత్రి ఏమన్నాడో లక్ష్మీనారాయణ తెలుసుకోలేదు. కెసిఆర్ ఎటువంటి ప్రయోజనాలు ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కీలక స్థానంలో ఉన్న తాను ఒక మాట అనే ముందు వెనుకా ముందు ఆలోచించుకోలేదు. జస్ట్ ఆలోచితంగా కేసీఆర్ ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడిన యోధుడిగా కీర్తించాడు.

వాస్తవానికి లక్ష్మీనారాయణ జగన్ కేసు విచారిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి అప్పట్లో ఒక మాట అన్నాడు. “అసలు లక్ష్మీనారాయణకు బిజినెస్ రూల్స్ తెలియవని” వ్యాఖ్యానించాడు. లక్ష్మీనారాయణ తాజాగా చేసిన ట్వీట్ రమాకాంత్ రెడ్డి ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి. అసలు కేంద్ర మంత్రి ఏమన్నాడో తెలియదు, ఎవరో ఏదో రాస్తే దాన్ని పట్టుకుని కెసిఆర్ అపూర్వ విజయం అంటూ ఆ భారత రాష్ట్ర సమితి ప్రచారం చేసుకుంది. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత తెల్ల మొహం వేసింది.

వాస్తవానికి విశాఖ స్టీల్ పై కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ దశలో కూడా ప్రైవేటీకరణకు సంబంధించి వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. మరి నిన్న అనాలోచితంగా వ్యాఖ్యలు చేసిన వారంతా మొహం ఎక్కడ పెట్టుకుంటారో. ఈ జాబితాలోకి కేటీఆర్ నుంచి హరీష్ దాకా ఉంటారు. అంతేకాదు విశాఖ స్టీల్ విషయంలో తాము ప్రదర్శించిన అజ్ఞానాన్ని డైవర్ట్ చేసేందుకు తెరపైకి బైలదిల్లా గనుల విషయాన్ని తీసుకొచ్చారు. ఉల్టా దాడి మొదలుపెట్టారు. వాస్తవానికి సింగరేణి స్టీల్ ప్లాంట్ బిడ్ కంటే ఇది మరింత హాస్యాస్పదం.. బైలదిల్లా గనులు నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలు. అక్కడ ఖనిజాన్ని వెలికి తీసే పనిని ఆదాని కంపెనీకి ఇస్తున్నారు. ఈ పనులకు సంబంధించి దాఖలు చేసిన బిడ్ లలో అదానీ ఎల్ వన్.. ఈ విషయం కూడా తెలియక ఆ కేటీఆర్ నెత్తి మాసిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇక హరీష్ అయితే గతానికి భిన్నంగా మాటలు తూలుతున్నాడు. నమస్తే తెలంగాణ అయితే శరభ శరభ అంటూ చర్నాకోలుతో ఒళ్లంతా కొట్టుకుంటున్నది. ఈమధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ డి దూకుడు ప్రారంభించిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రముఖులు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు.