
Vastu Direction: మనం బతకడానికి అన్నం తింటాం. లక్షాధికారి అయినా లవణమన్నమే కానీ బంగారం తినడు. మనం తినే తిండి కూడా వాస్తు ప్రకారం కూర్చుని తింటేనే ఒంట పడుతుంది. లేదంటే రోగాలు దరిచేరతాయి. ఈ నేపథ్యంలో భోజనం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇంటికి అతిథి వస్తే అతడికి ముందు భోజనం పెట్టాకే మనం తినాలి. ఇలా భోజనం విషయంలో ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ వాటిని ఎవరు పాటించడం లేదు. దీంతోనే మనకు నష్టాలు కలుగుతున్నాయి. ధనవంతుడైనా దరిద్రుడైనా సమయానికి భోజనం చేయాల్సిందే. లేదంటే బతకడం కష్టం. ఈ క్రమంలో వాస్తు ప్రకారం కొన్ని విషయాలు చెప్పారు. వాటిని పాటించాల్సిందే.
భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉత్తర లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా కూర్చుని ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు. దక్షిణం యమస్థానం. మృత్యువుకు సంకేతంగా చెబుతారు. అందుకే దక్షిణం వైపు కూర్చుని ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను తీసి దైవానికి మొక్కి పక్కన పెట్టాలి. భోజనం ముగించాక దాన్ని తీసి పక్షులకు ఆహారంగా వేయాలి. దీంతో అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గం కలుగుతుంది.
భోజన సమయంలో నీళ్ల గ్లాసును కుడి వైపునే పెట్టుకోవాలి. ఇలా చేస్తే శుభాలు కలుగుతాయి. జీవితం సంతోషంగా మారుతుంది. సంపద సమృద్ధిగా దొరుకుతుంది. భోజనం చేశాక కంచంలో చేతులు కడగకూడదు. ఇలా చేస్తే దారిద్ర్యానికి అవకాశం ఏర్పడుతుంది. సంపద రాకుండా పోతుంది. ఇంట్లో శాంతి, ఆనందం ఆవిరైపోతాయి. భోజనం ఎప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే చేయాలి. పరిశుభ్రమైన పల్లెంలోనే భోజనం వడ్డించుకోవాలి. లేదంటే మనకు నష్టాలే వస్తాయి.

పచ్చని ఆకులో భోజనం చేయడం ఇంకా శుభం. పూర్వం రోజుల్లో అరటాకులో భోజనం చేసే వారు. అలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆనందిస్తుంది. దేవుడికి నైవేద్యం కూడా పచ్చని ఆకులోనే పెడుతుంటారు. భోజనానికి వెండి పల్లెం ఉపయోగిస్తే మంచిదే. బంగారంతో చేసిన బొట్టు ఉండాలి. అలా లేని వెండి పల్లెం భోజనానికి పనికి రాదు. ఇంకా భోజనం చేసిన వెంటనే నిద్రించకూడదు. ఇది కూడా ఆరోగ్యానికి హానికరమే. దరిద్రానికి చిహ్నంగానే పరిగణిస్తారు. ఇలా భోజనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.