
Samantha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్దిరోజుల నుండి ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈమధ్యనే ఈ వ్యాధి నుండి కాస్త ఉపశమనం పొంది మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనింది సమంత.అంత బాగానే ఉంది ఇక సమంత మామూలు స్థితికి వచ్చేసిందని అనుకుంటున్న ఫ్యాన్స్ కి మరో షాక్ ఇచ్చింది సమంత.
ఆమె ప్రస్తుతం ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యూనో గ్లోబోలిన్ థెరఫీ) తీసుకుంటున్నాను అంటూ సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఒక స్టేటస్ పెట్టింది.దీనిని చూసి అభిమానులు మళ్ళీ తమ ఫేవరెట్ హీరోయిన్ కి ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు..కానీ వాళ్ళు అంత కంగారు పడాల్సిన అవసరం లేదని సమంత సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.రోజు ఒక నాలుగు గంటల పాటు ఇవీఐజీ థెరఫీ చేయించుకుంటే సమంత శరీరం లోని ప్రాంతీ భాగానికి ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతుందని, అది కూడా మయోసిటిస్ చికిత్స లో భాగమే అని చెప్తున్నారు.
ఇక సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమంత కి అనారోగ్యం కారణం గా మధ్యలోనే ఆగిపోయింది.ఇప్పుడు ఆమె మళ్ళీ పాల్గొంటున్నందున త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయబోతుంది సమంత.

దీనితో పాటుగా ఆమె గుణశేఖర్ దర్శకత్వం లో ‘శాకుంతలం’ అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ నెల 17 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 14 వ తేదికి వాయిదా పడింది.వీటితో పాటుగా ఆమె బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘సీతడెల్’ వెబ్ సిరీస్ లో నటించబోతుంది.ఇందులో వరుణ్ ధావన్ హీరో గా నటిస్తున్నాడు, ఈమధ్యనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యింది..ఈ చిత్రం తో పాటుగా మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించబోతుంది సమంత.