Ratan Tata Dog: రతన్‌ టాటా ప్రేమగా పెంచుకున్న కుక్కకు వీలునామాలో ఏం రాశారంటే..?

రతన్ టాటా మూగ జీవాలంటే చాలా ప్రేమ ఈ విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. వీధి కుక్కల సంరక్షణకు చాలా హాస్పిటల్స్ ఏర్పాటు చేయించారు. ఆయనకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Written By: Mahi, Updated On : October 25, 2024 5:13 pm

Ratan Tata Dog

Follow us on

Ratan Tata Dog: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా మరణం భారతదేశంలోని ప్రతీ పేదడి ఇంట దు:ఖమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రతన్ టాటా టాటా కంపెనీలో ప్రవేశం నుంచి ప్రతీ ఆలోచన పేదవారి కోసమే చేసేవారు. పేదలు ఆనందంగా ఉంటేనే దేశం బాగుంటుందని నమ్మే వారిలో మొదటి వ్యక్తి రతన్ టాటా. రతన్ టాటా అంటే లక్షలు, కోట్లాది రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగా ఉండడం మాత్రమే కాదు జంతువులను కూడా ఎంతో ప్రేమించే వారు.. ఆయనకు మూగ జీవాలంటే చాలా ప్రేమ ఈ విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. వీధి కుక్కల సంరక్షణకు చాలా హాస్పిటల్స్ ఏర్పాటు చేయించారు. ఆయనకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు కుక్క ‘టిటో’ (Tito) పేరును కూడా ప్రస్తావించారు ఆయన. దాని జీవితకాల సంరక్షణకు ఖర్చు కోసం కొంత మొత్తాన్ని కూడా కేటాయించారట. టిటో బాధ్యతలను తన వద్ద ఎక్కువ కాలం వంటమనిషిగా పని చేసిన రాజన్‌ షాకు అప్పగించినట్లు తెలిసింది. రతన్‌ టాటా ఒక గతంలో ఒక కుక్కను పెంచుకున్నారు. దాని పేరు టిటో అయితే, అది మరణించింది. ఆ తర్వాత ఆయన కలత చెందారు. మరో కుక్కను దత్తత తీసుకున్నారు దానికి కూడా టిటో అనే పేరు పెట్టుకున్నారు.

మూడు దశాబ్దాలుగా తన వద్ద పని చేస్తూ.. తనకు తోడుగా ఉన్న వ్యక్తి గత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య పేర్లను రతన్ టాటా వీలునామాలో ప్రస్తావించినట్లు సమాచారం. టాటాకు ఉన్న దాదాపు రూ. 10,000 కోట్ల ఆస్తులు.. ఆయన నెలకొల్పిన ఫౌండేషన్లను సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని వీలునామాలో రాసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వీధి శునకాల సంరక్షణకు రతన్‌ టాటా ఎంతో తపనపడేవారు. తాజ్ హోటల్ ప్రాంగణంలో వీధికుక్కలకు ఆశ్రయం కల్పించారు. వీటిని చూసి టూరిస్టులు రాకపోవచ్చని ఉద్యోగులు అంటే వారు రాకున్నా పర్వాలేదు కానీ.. వీటిని మాత్రం బయటకు పంపించవద్దని సిబ్బందిని ఆదేశించారు రతన్ టాటా. అప్పటి నుంచి ప్రతీ రోజు తాజ్ లో నుంచి వీధి కుక్కలకు ఆహారం అందేది.

చివరిసారి ఆయన శునకాల కోసమే ఒక ప్రాజెక్టులో పని చేశారు. ముంబైలో ఐదంస్తుల భవనంలో ‘పెట్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఇందులో 200 శునకాలు ఉండేందుకు సౌకర్యం ఉంది. ఆరోగ్య కారణాలతో తీవ్ర అస్వస్థతకు గురైన టాటా ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అక్టోబర్‌ 9న మరణించారు.