RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరనే వినిపిస్తోంది. రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. టాలీవుడ్ టాప్‌మోస్ట్ హీరోలైన రామ్‌చరణ్, తారక్‌లు హీరోలుగా వస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు, ట్రైలర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక తాజాగా, కొమురం భీమ్ త్యాగాన్ని తెలుపుతూ.. వచ్చిన రివోల్ట్ ఆఫ్ భీమ్ సాంగ్ అందరి హృదయాలకు హద్దుకుంటోంది. కాగా, ఇప్పటికే, ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన రాజమౌళి.. బాలీవుడ్‌లోనూ ఎక్కడా తగ్గకుంటా ఈవెంట్లు నిర్వహిస్తూ దూసుకెళ్లిపోతున్నారు.

ఇటీవలే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ముఖ్య అతిథిగా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, బాలీవుడ్లో సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ స్టేజ్‌పైనా సందడి చేసేందుకు తారక్, చెర్రిలు సిద్ధం అవుతున్నారు.
ఈ స్టేజ్‌పైనే సల్మాన్‌తో కలిసి నాటు నాటు పాటకు డాన్స్ వేశారట. పప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనుండగా.. కొమురం భీమ్ పాత్రలో తారక్ దర్శనమివ్వనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని వంటి ప్రముఖ తారాగనం ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.