Heart Health: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడిని కలిగి ఉంటున్నారు. విధులు, ఇతర పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇలా బిజీ వాతావరణంలో ఉండేవారు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి మాత్రమే కాకుండా వివిధ ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో కొవ్వు పేరుకుపొయి ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఈ సమస్య వచ్చిన వారు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫలితం ఉండడం లేదు. అయితే కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిలో సజ్జలు ప్రధానంగా నిలుస్తున్నాయి.
పుర్వ కాలంలో ఆరోగ్య పద్ధతులు కచ్చితంగా పాటించేవారు. అందుకే చాలా మంది ఎక్కువ కాలం జీవించేవారు. అయితే ఇప్పుడు కొందరు జంక్ ఫుడ్ కు అలవాటు పడడంతో అనేక అనారోగ్యాన బారిన పడుతున్నారు. ఈ క్రమమంలో చాలా మంది మిల్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే సజ్జలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. సజ్జలు తినడం వల్ల అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇంవియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వారు కొన్ని విషయాలు నిరూపించారు. సజ్జలు నెంబర్ వన్ ఆల్కలీన్ డైట్ అని చెప్పారు. రోజూవారీలో భాగంగా తినే ఆహారంలో జంక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి సజ్జలు మంచి ఆయుర్వేదం అని నిరూపించారు. సజ్జలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగ బ్లడ్ ప్రెషర్ ను కండిషన్లో పెట్టడానికి ఇది సహకరిస్తుందని చెబుతున్నారు.
బ్లడ్ వేజల్స్ స్మూత్ గా ఉండడానికి, సజ్జలను ప్రతిరోజూ 100 గ్రాములు తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే సజ్జల్లో మెగ్నీషియం 115 మిల్లిగ్రాములు ఉంటుంది. అలాగే పైటోక్ న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పైటోక్ న్యూట్రియన్స్ కాంబినేషన్ హార్ట్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. సజ్జల్లో ఎక్కువగా ఫాస్పరస్ ఉంటుంది. ఇది బోన్ సెల్స్ ను రిపేర్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బోన్ సెల్స్ లోకి కాల్షియం అబ్సెప్షన్ ని పెంచడానికి సహకరిస్తుంది. పాస్పరస్ బోన్ స్ట్రెంత్ కాస్త హెల్దీగా ఉండడానికి సహకరిస్తుంది.