Srisailam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆలయం ఒకటి.అమ్మవారి అష్టాదశ పీఠాలలో ఒకటిగా శ్రీశైల భ్రమరాంబిక ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది అని చెప్పవచ్చు. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి చత్రపతి శివాజీకి ఎంతో అనుబంధం ఉంది.ఈ అనుబంధం గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. అసలు వీరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి అనే విషయాల గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం…
1677వ సంవత్సరంలో అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షాకు,చత్రపతి శివాజీకి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది ఈ క్రమంలోనే శివాజీ ఒకసారి శ్రీశైలానికి వచ్చారు.అప్పటికి సుల్తాన్ ఆ స్థానం లో ఉన్నటువంటి మంత్రులు అక్కన్న మాదన్న చత్రపతి శివాజీకి సాదర ఆహ్వానం పలికారు. అనంతరం చత్రపతి శివాజీ తిరుగు పయనమయే వరకు వారు తన వెంట ఉండి అతనికి అన్ని విషయాలలోనూ సహాయం చేశారు. ఇలా శివాజీ శ్రీశైల భ్రమరాంబిక ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ శివాజీ ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నించగా అప్పుడు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షమై తనకు ఒక ఖడ్గాన్ని ఇచ్చింది.
Also Read: మూర్ఖులతో వాదిస్తున్నారా.. అయితే మీ సమయం వృధా.. ఎందుకంటే?
ఇలా ఖడ్గాన్ని బహూకరించిన భ్రమరాంబికాదేవి తనకు యుద్ధంలో తిరుగు ఉండదని చెప్పింది.అందుకే చత్రపతి శివాజీ పాల్గొన్న ఏ యుద్ధంలో కూడా ఓడిపోకుండా తిరుగులేని విజయాన్ని సాధించేవారు. ఇందుకు గుర్తుగా అమ్మవారి ఆలయ గోపురం పై అమ్మవారు ప్రత్యక్షమై శివాజీ ఖడ్గం ఇస్తున్నటువంటి చిత్రాన్ని మనం చూడవచ్చు. అప్పటి నుంచి శివాజీ శ్రీశైల భ్రమరాంబిక ఆలయాన్ని సొంత ఖర్చులతో అద్భుతంగా నిర్మించడమే కాకుండా కృష్ణానది ఒడ్డున స్నానపు ఘాట్ లను ఏర్పరిచారు. అలాగే ఆలయ రక్షణ కోసం అక్కడ తన సైనికులను కొంతమందిని వదిలి వెళ్లారు. అలాగే అక్కడే ఉన్నటువంటి మ్యూజియంలో ఇప్పటికీ శివాజీ గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
Also Read: ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మనసు చెప్పింది వినాల్సిందే..?