https://oktelugu.com/

Shyam Singha Roy: ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ ​సింగరాయ్’​ ప్రోమో.. నాని ఎలివేషన్​ అదుర్స్​

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్​సింగరాయ్​.. ఈ సినిమాతోనే చాలా రోజుల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నాని. గతంలో నాని నటించిన వి, టక్​జగదీశ్​ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఈ సారి మాత్రం ఎలాగైనా మంచి సాలిడ్​ కొట్టాలనే కసితో రంగంలోకి దిగుతున్నాడు నాని. ఈ క్రమంలోనే రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో ఓ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 11:15 AM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్​సింగరాయ్​.. ఈ సినిమాతోనే చాలా రోజుల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నాని. గతంలో నాని నటించిన వి, టక్​జగదీశ్​ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఈ సారి మాత్రం ఎలాగైనా మంచి సాలిడ్​ కొట్టాలనే కసితో రంగంలోకి దిగుతున్నాడు నాని. ఈ క్రమంలోనే రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో ఓ పీరియాడికల్​ స్టోరీ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్​ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్​లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్​, పాటలకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నాని రెండు షేడ్స్​లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా, ఈ సినిమా నుంచి ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సింగరాయ్​ పాత్ర ఎలివేషన్​ను చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్​గా మారింది. ఈ ప్రోమోలో నాని పాత్రను బాగా చూపించారు. డిసెంబరు 24 న శ్యామ్​ సింగరాయ్​ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

    Also Read: అమ్మో.. బ్రహ్మి-బాలయ్య కామెడీ మాములుగా లేదుగా.. ట్రెండింగ్​లో అన్​స్టాపబుల్​ కొత్త ప్రోమో

    Shyam Singha Roy

    కాగా, ఎప్పటి నుంచో మంచి హిట్​కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ సినిమాపైనే ఆశలన్నీ ఉన్నాయి. దానికి తోడు, ఇటీవలే ఓటీటీలో తన సినిమా విడుదల చేయడంపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం గతంలో నాని నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాని ఏ మేరకు విజయం సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.

    Also Read: ‘బంగార్రాజు’ సినిమా నుంచి త్వరలో మంచి మెలోడీ సాంగ్​.. ఆకట్టుకుంటున్న టీజర్​